Viral Video : బిజినెస్ ట్రిక్స్ చెప్పిన‌ గుడ్ల వ్యాపారులు… ఫ‌న్నీ వీడియో వైర‌ల్

Authored By mallesh | The Telugu News | Published on: April 8, 2022, 6:00 pm

Viral Video : సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే న‌వ్వాలో ఏడ్వాలో అర్థం కాదు. వాడికి బుర్ర లేక‌ చేస్తున్నాడా.. లేక కావాల‌నే చేస్తున్నాడా.. అనిపిస్తుంది. కొన్ని వీడియోలు న‌వ్వుని తెప్పిస్తే మరికొన్ని తమషాగా ఉంటాయి. కొన్ని వీడియోస్ చూస్తే వీడి తెలివేంట్రా బాబూ.. అనిపిస్తుంది. కొంద‌రు ఫ‌న్ కోసం వీడియోలు చేస్తే.. మ‌రికొంద‌రు అనుకోకుండా ఏదో చేస్తూ ఫ‌న్ పుట్టిస్తారు.

ఇది కాస్తా వైర‌ల్ గా మారుతుంది. కొంత మంది త‌మాషా కోసం చేస్తుంటే మ‌రికొంత మంది పాపుల‌ర్ అవ‌డానికి చేస్తుంటారు.బిజినెస్ చిన్న‌దైనా పెద్ద‌దైనా పోటి త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. అందుకే ఆస‌క్తితో ఆలోచించి చేయాలి. లేదంటే స‌ర్వం కోల్పోవాల్సి వ‌స్తుంది. బిజినెస్ ట్రిక్స్ కూడా తెలిసుండాలి. అప్పుడే వ్యాపారంలో పైకి వ‌స్తాం. తెలివి త‌క్కువ‌గా వ్య‌వ‌హ‌రిస్తే ఉన్న‌ది కోల్పోతాం.. అలాగే ఇప్పుడు ఒక వీడియో వైర‌ల్ గా మారింది. ఇక్క‌డా ఇద్ద‌రు వ్య‌క్తులు గుడ్లు అమ్ముతున్నారు.

Viral Video Egg traders telling business tricks 

Viral Video Egg traders telling business tricks

ఒక‌త‌ను డ‌జ‌ను గుడ్లు యాబై రూపాయ‌ల‌కు బోర్డు పెట్టాడు మారో వ్య‌క్తి న‌ల‌బై రూపాయ‌ల‌కు బోర్డు పెట్టాడు. అప్పుడు క‌స్ట‌మ‌ర్స్ ఎలాగూ త‌క్కువున్న చోటే కొంటారు. అది చూసి యాబై రూపాయ‌ల‌కు అమ్ముతున్న వ్య‌క్తి స‌డెన్ గా బోర్డు మార్చుతాడు. కేవ‌లం 30 రూపాయ‌ల‌కే అని ప్ర‌క‌టిస్తాడు. దీంతో రెండో వ్యాపారి వెంట‌నే 30 చొప్పున మొద‌టి వ్యాపారి ద‌గ్గ‌ర ఉన్న మొత్తం గుడ్ల‌ను కొనేసి వెంట‌నే 60 రూపాయ‌లుగా రేటు మార్చి అమ్ముతాడు. గుడ్ల‌న్ని అమ్ముకున్న వ్య‌క్తి షాక్ అవ‌డం త‌ప్పా చేసేది ఏమిలేపోయింది. ఈ వీడియో ను చూస్తూ నెటిజ‌న్లు తెగ న‌వ్వు కుంటున్నారు.

https://twitter.com/TheFigen/status/1511778055563497482

mallesh

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp