Sudigali Sudheer : మరో కొత్త డ్రామా?.. సుడిగాలి సుధీర్ పాపులారిటీని వాడేస్తోన్న మల్లెమాల

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 8, 2022, 4:30 pm

Sudigali Sudheer : బుల్లితెరపై సుధీర్‌కి ఉన్న ఫాలోయింగ్ వేరే లెవెల్. సుడిగాలి సుధీర్ అనేది ఒక బ్రాండ్‌లా మారిపోయింది. సుధీర్ ఉంటే చాలు ఆ షో హిట్ అనేంతగా తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే సుధీర్ రష్మీ జోడిని మల్లెమాల భారీగా వాడేసింది. ఆ ఇద్దరి మీద గతంలో ఎన్నో ఈవెంట్లను ప్లాన్ చేసింది. నిశ్చితార్థం, పెళ్లి, శోభనం అంటూ ఇలా ఇద్దరి మీద రకరకాల ఈవెంట్లు చేసింది. అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.సుధీర్ రష్మీ జోడి అయిన తరువాత వర్ష ఇమాన్యుయేల్ అన్నారు..

ఆ తరువాత రాకేష్ రోహిణి అన్నారు.. ఇప్పుడు రాకేష్ సుజాత అంటున్నారు. మధ్యలో నరేష్ షబీనా అని కాస్త ఏదో ట్రై చేశారు. మొత్తానికి బుల్లితెరపై మాత్రం ఈ రొమాంటిక్ ట్రాక్, లవ్ ట్రాకులను బాగానే నడిపిస్తున్నారు. ఇక ఇప్పుడు సుధీర్ పెళ్లి మీదనే శ్రీదేవీ మల్లెమాల బాగా ఫోకస్ పెట్టేసినట్టు కనిపిస్తోంది.ఆ మధ్య సుధీర్ ఎంగేజ్మెంట్ అంటూ ఓ ప్రోమోను వదిలారు. తీరా ఆ షోలో చూస్తే అసలు విషయం బయటపడింది. ఓ నలుగురు అమ్మాయిలు సుధీర్ గురించి కలలు కంటారట.. అందులో సుధీర్ తనను పెళ్లి చేసుకున్నాడని కలలు కనేసింది. దీన్ని మనకు ప్రోమోలో వేసి చూపించారు.

Mallemala TRP Tricks On Sudigali Sudheer In Sridevi Drama Company

Mallemala TRP Tricks On Sudigali Sudheer In Sridevi Drama Company

సుధీర్ ఎంగేజ్మెంట్ అంటూ ఇచ్చిన కలరింగ్ మామూలుగా లేదు. అదొక టీఆర్పీ స్టంట్ అని అందరూ కనిపెట్టేశారు. కానీ సుధీర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త నమ్మేశారు.మళ్లీ ఇప్పుడు సుధీర్ మీదనే మల్లెమాల ఆధారపడింది. తాజాగా వదిలిన ప్రోమోలో సుధీర్ తన ప్రేమ గురించి, తాను చేసుకోబోయే అమ్మాయి గురించి చెబుతున్నట్టుగా ప్రోమోను కట్ చేశారు. కానీ తీరా ఎపిసోడ్ చూస్తే మాత్రం అదేం ఉండదు. నిజంగానే సుధీర్ తాను చేసుకోబోయే అమ్మాయి పేరు చెప్పేస్తాడా? చూపించేస్తాడా? అని అందరూ తెగ ఎదురుచూస్తున్నట్టుగా ఆ ప్రోమో ఉంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp