రష్మీ క్యారవాన్‌లో ఇమాన్యుయల్.. అందరి ముందు ఓపెన్‌గా చెప్పేశాడు.. వీడియో!!

Authored By Admin | The Telugu News | Updated on : 12 December 2020, 5:39 pm

జబర్దస్త్ స్టేజ్ మీద ఈ మధ్య ఇమాన్యుయేల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రంగు తక్కువ ఉందని ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆ రంగునే తనకు ప్లస్ పాయింట్‌లా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ నలుపు రంగు, ఆ రూపు రేఖలతోనే ఫేమస్ అయ్యాడు. తన ఆహార్యంపై తానే సెటైర్లు వేసుకుంటూ.. పక్కన పాల సుందరి లాంటి వర్షను పెట్టుకుని ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇమాన్యుయేల్, వర్ష కాంబోకు బోలెడంత ఫాలోయింగ్ ఉంది.

Emmanuel Satires On Rashmi Gautam In Extra Jabardasth

Emmanuel Satires On Rashmi Gautam In Extra Jabardasth

తాజాగా ఈ ఇద్దరూ వేసిన స్కిట్, దానికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో ఫుల్ వైరల్ అవుతోంది. నలుపు నలుపు తెలుపు తెలుపు అనే పాటకు వర్ష ఇమాన్యుయేల్ డ్యాన్స్ చేశారు. నా పక్కన నిల్చుంటే ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? అంటూ వర్షను పొగిడేశాడు. ఇంకాస్త దగ్గరకు వస్తే ప్రోమోలో వస్తామ్.. ఇంకాస్త దగ్గరికి వస్తే లవ్ సింబల్ వేసి ఎడిట్ చేస్తారు.. ఇంకాస్త దగ్గరికి వస్తే అంటూ ఇమాన్యుయేల్ పూర్తి చేసే లోపు.. రష్మీ అందుకుని సెటైర్ వేసింది. ఇంకాస్త దగ్గరికి వెళ్లే ఎడిటింగ్‌లో మొత్తం పోతుందని రష్మీ సెటైర్ వేసింది.

తాను కేరవాన్‌లో ఉంటే బయట తన కోసం రష్మీ ఉంటుందని ఇమాన్యుయేల్ చెప్పాడు. ఎందుకు అంటూ వర్ష ఆత్రుతతో అడుగుతుంది. ఎందుకంటే ఆ క్యారవాన్ రష్మీదే.. నేను ఎప్పుడు బయటకు వస్తానా? ఆమె ఎప్పుడు లోపలకి వెళ్తానా? అని ఎదురుచూస్తుందని చెప్పాడు. అయితే రష్మి క్యారవాన్‌లోకి ఇమాన్యుయెల్ ఎందుకు వెళ్లాడో మాత్రం చెప్పలేదు. అయినా నిజంగానే వెళ్తాడో లేదా అలా స్కిట్‌లో పంచ్‌లు, ప్రాస కోసం చెప్పాడో అతనికే తెలియాలి.

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp