
ester noronha Comments on CIne industry
Ester Noronha: నోయల్ మాజీ భార్య, నటి ఎస్తేర్ నోరోన్హా చాలా రోజుల తర్వాత.. ‘‘69 సంస్కార్ కాలనీ’ అనే చిత్రం చేసింది. ఒక సాధారణ గృహిణి జీవితంలో ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్ స్టైల్ ఉంటే ఎలా ఉంటుంది? తన జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది కథ. పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘69 సంస్కార్ కాలనీ’. బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎస్తేర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచింది.
సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయమయ్యింది ఎస్తేర్. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. అందులో తేజ తెరకెక్కించిన వేయి అబద్ధాలు కూడా ఉంది.ఆ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్ జయ జయ జానకి నాయక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించింది. మరికొన్ని సినిమాలు కూడా చేస్తున్న సమయంలోనే సింగర్ నోయల్‌తో ప్రేమలో పడింది. నటన పరంగా ఎస్తేర్ మంచి మార్కులు సంపాందించుకున్నప్పటికీ.. ఈమెకు తెలుగులో మాత్రం అవకాశాలు రాలేదు. దాంతో పక్క ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది ఏస్తేర్. అయితే పెళ్లి తర్వాత ఆరు నెలలకే అతనికి బ్రేకప్ చెప్పింది.
ester noronha Comments on CIne industry
ఎస్తేర్ తాజా చిత్రంలో ఆమె ఓ కుర్రాడితో రొమాన్స్ చేసే సన్నివేశాలున్నాయి. వీటిపై కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా చేయడం వల్ల..సీన్స్‌లో నటించడం వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. దానికి ఎస్తేర్ ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఘాటుగానే స్పందించింది. మగవారికేనా కోరికలు..మాకు ఉండవా అంటూ సూటిగా ప్రశించింది. అంతేకాదు, ఈ మూవీలో నటించిన అబ్బాయిని మాత్రం ఎవరూ అడగడం లేదు..నన్ను మాత్రం ట్రోల్ చేస్తున్నారంటూ రివర్స్‌లో కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఎస్తేర్ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్‌గా ఇండస్ట్రీలో అన్‌ప్రొఫెషనల్ ట్రాక్స్ తాను చాలా చూశానని బయటపెట్టింది ఎస్తర్. తనకు సినిమా ఆఫర్లతో పాటు అలాంటి ఆఫర్లు కూడా వచ్చేవని తెలిపింది. వాళ్లని ఇంప్రెస్ చేయమని అడుగుతూ ఉండేవారని చెప్పింది ఎస్తర్. ఆఫర్ల కోసం ఏం చేయడానికైనా రెడీ అయిన హీరోయిన్లు కూడా ఉన్నారని, అలాంటి వాటి స్క్రీన్ షాట్స్ కూడా తాను చూశానని స్పష్టం చేసింది ఎస్తర్.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.