
Ester Noronha : కళ్ల ముందు తప్పు చేస్తూ దొరికిపోయాడు .. అందుకే విడాకులు తీసుకున్నా అని నోయెల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్తేర్ నొరోన్హా..!
Ester Noronha : ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు తమ బంధాన్ని కొద్ది రోజులకే తెంపుకుంటున్నారు. వారి మధ్య ఏం జరుగుతుందో తెలియదు కానీ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకొని చర్చనీయాంశంగా మారుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకుని కొద్ది రోజులకే విడిపోయారు. ఇక తాజాగా రాప్ కం సింగర్ అయినా నోయల్, సినీనటి ఎస్తేర్ నోరన్హా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2019లో ఇద్దరు చాలా ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చి ఆశీర్వదించారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, పోస్ట్ వెడ్డింగ్ అంటూ చాలా పార్టీలు కూడా చేసుకున్నారు.
అయితే పెళ్లయిన మూడు నెలలకే కొన్ని విభేదాల కారణంగా ఈ జంట విడిపోయారు. అయితే విడాకులకు కారణం ఏంటనేది మాత్రం బయటికి చెప్పకుండా జాగ్రత్తపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తేర్ నోయల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన 16 రోజులకి నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నానని, అతడు ప్రతి చోట నన్ను బ్యాడ్ చేయడానికి చూశాడని, అందుకే అతడి నుంచి విడిపోవాలని డిసైడ్ అయిపోయానని ఆమె ఓపెన్ గా చెప్పారు. అందుకే అంత త్వరగా విడాకులు తీసుకున్నామని ఎస్తేర్ చెప్పుకొచ్చారు. విడాకుల తర్వాత నోయల్ తనపై చెడు ఇంపాక్ట్ పడేలా క్రియేట్ చేశాడని ఎస్తేర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనుకున్నా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నోయల్ క్రియేట్ చేసిన చెడు ప్రభావంతో తనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయని ఆమె చెప్పింది.
అంతా నాదే తప్పు అనుకోని ఒక వ్యక్తి ఏకంగా నేను హైదరాబాద్ వస్తే యాసిడ్ పోస్తానని హెచ్చరించాడని తెలిపింది. దీంతో ఈ విషయాలు జనాల్లో హాట్ ఇష్యూ అయ్యాయని అన్నారు. విడాకులు తీసుకునే సమయంలో కొందరు మేము ఉన్నామని ధైర్యం ఇచ్చారని తెలిపారు. విడాకులు తీసుకొని మంచి పనే చేశానని ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఇక భీమవరం బుల్లోడు, 1000 అబద్దాలు, జయ జానకి నాయక లాంటి సినిమాల్లో ఎస్తేర్ నటించారు. పలు సినిమాలలో హీరోయిన్ గా నటించారు. అయితే ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఇక ఆమె తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళం సినిమాలలో కూడా నటించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.