Dhee Dance Show : ఈటీవీలో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న డాన్స్ షో ఢీ కొత్త సీజన్ ప్రారంభం అయింది. ఈ సీజన్ లో శేఖర్ మాస్టర్ సందడి చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రోమో లో శేఖర్ మాస్టర్ సందడి చేయడం తో ఇక సీజన్ మొత్తం ఆయన ఉంటాడు అంటూ అంతా విశ్వాసంతో ఉన్నారు. గతంలో శేఖర్ మాస్టర్.. సుధీర్.. రష్మీ.. ప్రదీప్ ఉన్న ఎపిసోడ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ఢీ డాన్స్ షో కి మళ్లీ శేఖర్ మాస్టర్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆయన గెస్ట్ గా వచ్చాడా లేదంటే పూర్తి స్థాయి జడ్జిగా వచ్చాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. శేఖర్ మాస్టర్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది సుధీర్ మరియు రష్మీ లు కూడా రావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మల్లెమాల నుండి దూరంగా ఉంటున్న సుధీర్ ఈ కార్యక్రమానికి వస్తే కచ్చితంగా జబర్దస్త్ లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయనకు ఆహ్వానం అందలేదని అంటున్నారు. పెద్ద ఎత్తున సుడిగాలి సుదీర్ కి ఉన్న అభిమానుల కారణంగా కచ్చితంగా షో మంచి హిట్ అవుతుందని అంత భావిస్తున్నారు. కానీ సుధీర్ వచ్చే పరిస్థితి కనపడటం లేదు.
శేఖర్ మాస్టర్ అయినా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే సుడిగాలి సుధీర్ కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఢీ కు సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముందు ముందు షో సూపర్ హిట్ అవడం ఖాయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢీ 14 సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కనుక ఢీ 15 కూడా అదే స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
This website uses cookies.