Jathi Ratnalu Show : ఆ జాతిరత్నాలు సూపర్‌ హిట్‌.. ఈ జాతిరత్నాలు అట్టర్ ప్లాప్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jathi Ratnalu Show : ఆ జాతిరత్నాలు సూపర్‌ హిట్‌.. ఈ జాతిరత్నాలు అట్టర్ ప్లాప్‌

Jathi Ratnalu Show : ఈటీవీ అంటే ఒకప్పుడు బ్రాండ్‌.. ఆ టీవీలో వచ్చే షోలు.. సీరియల్స్ అన్ని కూడా టాప్ అన్నట్లుగా ఉండేది. కాని ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు పేరు గొప్ప అన్నట్లుగా ఉండేది. కాని ఇప్పుడు దిబ్బ అన్నట్లుగా తయారు అయ్యింది. అత్యంత దారుణమైన పరిస్థితులు ఈటీవీ ఎదుక్కొంటుంది. నెం.1 స్థానం నుండి నెం.4 స్థానం వైపుకు అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో ఈటీవీ నుండి వచ్చిన ఈటీవీ ప్లస్‌ కూడా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 June 2022,9:00 pm

Jathi Ratnalu Show : ఈటీవీ అంటే ఒకప్పుడు బ్రాండ్‌.. ఆ టీవీలో వచ్చే షోలు.. సీరియల్స్ అన్ని కూడా టాప్ అన్నట్లుగా ఉండేది. కాని ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు పేరు గొప్ప అన్నట్లుగా ఉండేది. కాని ఇప్పుడు దిబ్బ అన్నట్లుగా తయారు అయ్యింది. అత్యంత దారుణమైన పరిస్థితులు ఈటీవీ ఎదుక్కొంటుంది. నెం.1 స్థానం నుండి నెం.4 స్థానం వైపుకు అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో ఈటీవీ నుండి వచ్చిన ఈటీవీ ప్లస్‌ కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈటీవీ ప్లస్ లో ఆమద్య వచ్చిన పటాస్ బాగానే సక్సెస్ అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల దాన్ని క్యాన్సిల్‌ చేయడం జరిగింది.

ఆ ప్లేస్ లో అన్నట్లుగా జాతిరత్నాలు షో వస్తోంది. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో జబర్దస్త్‌ వాళ్లు చాలా మంది ఉన్నారు. వారు వెనుక వుండి నడిపిస్తున్నారు. మల్లెమాల వారు ఈ షో ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టాలెక్కించింది. కొత్త కమెడియన్స్ ఈ షో ద్వారా చాలా మంది పరిచయం అవుతారు అని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఒక్కటి అంటే ఒక్కటి ఎపిసోడ్‌ కూడా సక్సెస్ అవ్వడం లేదు. మరీ ఇలా నాసిరకంగా ఉందేంటి అంటూ ఈ జాతిరత్నాలు షో ను జనాలు మరియు ప్రేక్షకులు బాహాటంగానే విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు.

etv plus Jathi Ratnalu Show is not good rating

etv plus Jathi Ratnalu Show is not good rating

జాతిరత్నాలు కామెడీ షో కు వస్తున్న ఆధరణ జీరో అవ్వడంతో త్వరలోనే దుఖాణం మూసి వేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. వెండి తెరపై వచ్చిన జాతిరత్నాలు అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. రూపాయికి పది రూపాయిల ఫలితాన్ని ఇచ్చింది. కాని ఈ జాతి రత్నాలు మాత్రం పదిరూపాయల ఖర్చుకు కనీసం అయిదు రూపాయల ఆదాయం తీసుకు రావడం లేదు అనేది చాలా మంది అభిప్రాయం. అందుకే జాతిరత్నాలు అట్టర్‌ ప్లాప్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.. శ్రీముఖి మరియు పంచ్ ప్రసాద్‌ ల కోసం తాము చూస్తున్నాం అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా మాట్లాడుకుంటున్నారు. జాతిరత్నాలు గెటిన్‌ అవ్వడం దాదాపు అసాధ్యం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది