ETV Plus Jathi Ratnalu : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ ఇతర కామెడీ కార్యక్రమాల తరహాలోనే ఈటీవీ ప్లస్ లో కూడా వరుసగా కామెడీ కార్యక్రమాలను తీసుకు రావడం ద్వారా మంచి సక్సెస్ అవ్వాలని.. ఈటీవీ తరహాలోనే టాప్ రేంజ్ లో ఈటీవీ ప్లస్ ఛానల్ ని నిలపాలని ఉద్దేశంతో శ్రీముఖి యాంకర్ గా మల్లెమాల వారు జాతిరత్నాలు అనే కామెడీ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి గత రెండు మూడు వారాలుగా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేయడంతో పాటు ఎక్కడపడితే అక్కడ శ్రీముఖి తన జాతి రత్నాలు కార్యక్రమాన్ని ప్రమోట్ చేసుకుంటూ తెగ మాట్లాడేస్తున్నారు.
గత మూడు వారాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాతిరత్నాలు మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. అందరి అంచనాలను ఈ కార్యక్రమం ముందు ముందు అందుకుంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే మొదటి ఎపిసోడ్ కనుక కచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మొదటి ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మొదటి ఎపిసోడ్ లో ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి మరియు స్టార్ కమెడియన్ కృష్ణభగవాన్ కనిపించారు. వారితో పాటు సీనియర్ నటి అన్నపూర్ణ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జ్ ఇంద్రజ కూడా జాతిరత్నాలు కార్యక్రమంలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో కమెడియన్స్ గా నూకరాజు మరియు పంచ్ ప్రసాద్ సందడి చేశారు. వీరు మాత్రమే కాకుండా కొత్త వారికి కూడా జాతిరత్నాలు టీం అవకాశం కల్పించింది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎంతో మంది జాతి రత్నాలు కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది. దాదాపు పది వేల మంది నుండి ఆడిషన్స్ నిర్వహించి వీళ్ళని తీసుకున్న కారణంగా కచ్చితంగా షో ముందు ముందు సక్సెస్ అవుతుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు ఇంత మంది సెలబ్రెటీలు స్టార్స్ రావడం వల్ల ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ని దక్కించుకున్నారు. అలాగే ప్రేక్షకులు పాజిటివ్ గా రెస్పాన్స్అయ్యారు. మొదటి ఎపిసోడ్ సూపర్ హిట్ మరి ఇక నుండి ఎలా ఉంటాయి అనేది చూడాలి.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
Tollywood Actors : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాలలో వారు కలిసి…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్లోని కంటెస్టెంట్స్ని చూస్తుంటే వారు సెలబ్రిటీల మాదిరిగా కనిపించడం లేదు.…
This website uses cookies.