Home » Entertainment » Etv Plus Sreemukhi Jathi Ratnalu Show Talk
Entertainment

Sreemukhi : జాతి రత్నాలు షో కి శ్రీముఖి మైనస్ అవబోతుందా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 3, 2022, 8:00 pm
Advertisement

Sreemukhi : ఈటీవీ లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న మల్లెమాల వారు ప్రస్తుతం ఈటీవీ ప్లస్ కోసం జాతి రత్నాలు అనే స్టాండప్ కామెడీ షో నిర్వహించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తారీకు నుండి టెలికాస్ట్ కాబోతున్న జాతిరత్నాలు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే సమయం లో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మల్లెమాల వారు నిర్వహించిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సూపర్ హిట్ అవుతున్న నేపథ్యం లో జాతిరత్నాలు కామెడీ షో కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఈటీవీ ప్లస్ కి ఖచ్చితంగా మంచి రేటింగ్ వచ్చేలా చేస్తుంది అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం.

Advertisement

ఇదే సమయంలో కొందరు శ్రీముఖి యాంకర్ అవ్వడం వల్ల ఈ షో కి మైనస్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం లో చాలా మంది పాజిటివ్ గా ఉన్నా కూడా శ్రీముఖి విషయం లో మాత్రం కాస్త విభిన్నమైన ఆలోచనతో ఉన్నారని సమాచారం అందుతోంది. శ్రీముఖి అంటే చాలా మందికి అభిమానం ఉంటుంది. కానీ ఆమె క్రేజ్‌ మరియు ఆమె స్టామినా జాతిరత్నాలు షోలో కమెడియన్స్ ను డామినేట్ చేసే విధంగా ఉండే అవకాశం ఉంది. తద్వారా ఆమె యొక్క యాంకరింగ్ హైలెట్ అయ్యి కమెడియన్స్ యొక్క కామెడీ తగ్గుతుంది ఏమో అంటూ కొందరు గుసగుసలు లాడుతున్నారు.

etv plus sreemukhi jathi ratnalu show talk

Advertisement

అంటే కామెడీ సీన్స్ కంటే శ్రీముఖి యొక్క అందానికి మరియు ఆమె ఒక్క యాక్టివ్ కి ప్రతి ఒక్కరూ ఆకర్షితులయ్యే అవకాశం ఉంది.తద్వారా షో యొక్క కామెడీ గాడి తప్పే అవకాశాలు లేక పోలేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అదే కనుక జరిగితే శ్రీముఖి వల్ల ఖచ్చితంగా జాతిరత్నాలు షో కి డ్యామేజీ తప్పదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ ప్రారంభం అయిన సమయం లో అనసూయ రష్మీ కానీ ఏ ఒక్కరికీ పెద్దగా తెలిసిన తెలియదు. కనుక వారి యొక్క అప్పియరెన్స్ గురించి మొదట ఎక్కువగా చర్చ జరగలేదు. షో సూపర్ హిట్ అయిన తర్వాత జనాలు వారి పై దృష్టి పెట్టడం, వారి యొక్క అంద చందాల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. కనుక ఇప్పుడు జాతిరత్నాలు షో కి ఖచ్చితంగా శ్రీముఖి మైనస్ అవుతుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి