Express Hari Open Up On Love About Ashu Reddy In Party Cheddam Pushpa part 2
Ashu Reddy : ఎక్స్ ప్రెస్ హరి, అషూ రెడ్డిల ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో అన్నయ్య అంటూ హరిని ఆట పట్టించేది అషూ రెడ్డి. ఆ తరువాత మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ అనడం మొదలుపెట్టేసింది. ఇక ఆమె కోసం టాటూలు వేయించుకున్నాడు హరి. తన గుండెల మీద ఆమె పేరుని పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. అయితే హరి చేష్టలకు అషూ రెడ్డి స్టేజ్ మీద వాయించేసింది. ఫైర్ అయింది. అలాంటివి చేయొద్దని అనేసింది. కానీ ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం ఆ టాటూను చూసుకుని మురిసిపోయినట్టుంది. అషూ రెడ్డి, హరిల స్టోరీ మీద రకరకాల రూమర్లు వస్తుంటాయి.
అదంతా టీఆర్పీ కోసం చేస్తుంటారని తీసిపారేస్తుంటారు. ఇంకొందరు మాత్రం అదంతా నిజమని నమ్ముతుంటారు. హరి కోసం కాస్ట్ లీ బైకును గిఫ్ట్‌గా ఇచ్చింది అషూ రెడ్డి. హరి, అషూ రెడ్డి వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో ఏమో గానీ తాజాగా మరోసారి స్టేజ్ మీదే రెచ్చిపోయింది ఈ జంట. పార్టీ చేద్దాం పుష్ప పార్ట్ 2 కు సంబంధించిన ప్రోమోను వదిలారు. ఇందులో అషూ రెడ్డి, ఎక్స్ ప్రెస్ హరి ట్రాక్ పెట్టేశారు. ఇక స్టేజ్ మీదే హరి మరోసారి ప్రపోజ్ చేశాడు. ఎప్పుడూ ఆమె ఇస్తేనే తీసుకుంటావా? నువ్ ఏమీ ఇవ్వవా? అని అందరూ నన్ను అడుగుతుంటారు..
Express Hari Open Up On Love About Ashu Reddy In Party Cheddam Pushpa part 2
అయినా అషూకి నేనేం ఇవ్వగలను.. నా గుండెను గులాబిలా మార్చి ఆమె గుమ్మం ముందు పెట్టడం తప్పా.. ఎందుకే ఆమె దేవత..అంటూ అషూ రెడ్డికి ప్రపోజ్ చేశాడు హరి. ఇక ప్రేమ అని అంటూ అషూ రెడ్డి ఏదో చెప్పబోయింది.. మొత్తానికి హరి, అషూ ట్రాక్‌ను మళ్లీ లైన్లో పెట్టించాలని ప్రయత్నిస్తున్నట్టుంది. మొత్తానికి అషూ రెడ్డి వ్యవహారాలు అంత తేలిగ్గా అంతుపట్టవు. బిగ్ బాస్ ఇంట్లో ఎంత వింతగా ప్రవర్తించిందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో అఖిల్‌తో అషూ కనెక్ట్ అయినట్టుంది. ఇక అజయ్‌తో ఫ్రెండ్ షిప్ అయితే బాగానే కంటిన్యూ అవుతోంది. మరో వైపు రాహుల్ కూడా ఉన్నాడు. ఇక మధ్యలో ఎక్స్ ప్రెస్ హరి కూడా వచ్చాడు. మొత్తానికి అషూ రెడ్డి మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.