fan threatens sonakshi sinha
Sonakshi Sinha : బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. శతృఘ్న సిన్హా తనయగా సినీ ఇండస్ట్రీలోకి దబాంగ్ సినిమాతో అడుగు పెట్టిన సోనాక్షి సిన్హా, తర్వాత నటిగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఈమె రజినీకాంత్ సరసన లింగ సినిమాలోనూ నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ అమ్మడికి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా పుకార్లు వస్తున్నాయి. సల్మాన్‌తో పెళ్లి జరిగిందని ప్రచారం సాగగా, దానిపైన ఘాటుగానే స్పందించింది. తాజాగా ఆమెకి ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. దాదాపు ఆమె భయపడి కేకలు వేసేంతగా.సోనాక్షి ‘ది ఖత్రా ఖత్రా’ షోలో పాల్గొనడానికి వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లింది. అక్కడ బాత్రూమ్ నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు.
అతన్ని చూసి సోనాక్షి షాకైంది. ఇక్కడ నువ్వేం చేస్తున్నావని అడిగింది. దానికి అతను నేను మిమ్మల్ని కలవడానికి నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉంటున్నానని అన్నాడు. తను మాట్లాడుతూ బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. తన చేతిపై సోనాక్షి అనే పచ్చబొట్టును చూపించాడు. అక్కడే ఉన్న అద్దంపై ఐ లవ్ యూ అని లిప్ స్టిక్‌తో రాశాడు. తాను రక్తంతో కూడా అలా రాస్తానని చెప్పడంతో సోనాక్షి కాస్త భయపడింది. తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే గొంతు కోసుకుంటానని చెబుతూ జేబులో నుంచి కత్తి తీసున్నాడా యువకుడు.
fan threatens sonakshi sinha
దాంతో సోనాక్షి సిన్హా భయపడి గార్డ్స్ అంటూ కేకలు వేసింది.అయితే ఇదంతా షోలో భాగంగానే చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండగా, దీనిపై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు అందాలను నమ్ముకుని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. మరోవైపు మాల్డీవుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. సోనాక్షి ఏం చేసిన అది ఇటీవలి కాలంలో సెన్సేషన్‌గా మారుతుంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.