Sonakshi Sinha : హీరోయిన్‌ని పెళ్లి చేసుకోమ‌ని క‌త్తితో బెదిరించిన అభిమాని

Authored By Sam C | The Telugu News | Published on: April 10, 2022, 2:30 pm

Sonakshi Sinha : బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ పర్స‌న్. శతృఘ్న సిన్హా త‌న‌య‌గా సినీ ఇండ‌స్ట్రీలోకి ద‌బాంగ్ సినిమాతో అడుగు పెట్టిన సోనాక్షి సిన్హా, త‌ర్వాత న‌టిగా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఈమె ర‌జినీకాంత్ స‌ర‌స‌న లింగ సినిమాలోనూ న‌టించిన సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఈ అమ్మ‌డికి సంబంధించి ఈ మ‌ధ్య కాలంలో చాలా పుకార్లు వ‌స్తున్నాయి. స‌ల్మాన్‌తో పెళ్లి జ‌రిగింద‌ని ప్రచారం సాగ‌గా, దానిపైన ఘాటుగానే స్పందించింది. తాజాగా ఆమెకి ఓ విచిత్ర‌మైన ప‌రిస్థితి ఎదురైంది. దాదాపు ఆమె భ‌య‌ప‌డి కేక‌లు వేసేంత‌గా.సోనాక్షి ‘ది ఖత్రా ఖత్రా’ షోలో పాల్గొనడానికి వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లింది. అక్క‌డ బాత్రూమ్ నుంచి ఓ వ్య‌క్తి బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

అత‌న్ని చూసి సోనాక్షి షాకైంది. ఇక్క‌డ నువ్వేం చేస్తున్నావ‌ని అడిగింది. దానికి అత‌ను నేను మిమ్మ‌ల్ని క‌ల‌వ‌డానికి నిన్న రాత్రి నుంచి ఇక్క‌డే ఉంటున్నాన‌ని అన్నాడు. త‌ను మాట్లాడుతూ బ‌య‌ట‌కు వ‌చ్చి సోఫాలో కూర్చున్నాడు. త‌న చేతిపై సోనాక్షి అనే ప‌చ్చ‌బొట్టును చూపించాడు. అక్క‌డే ఉన్న అద్దంపై ఐ ల‌వ్ యూ అని లిప్ స్టిక్‌తో రాశాడు. తాను ర‌క్తంతో కూడా అలా రాస్తాన‌ని చెప్ప‌డంతో సోనాక్షి కాస్త భ‌య‌ప‌డింది. త‌ర్వాత త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని లేకుంటే గొంతు కోసుకుంటాన‌ని చెబుతూ జేబులో నుంచి క‌త్తి తీసున్నాడా యువ‌కుడు.

fan threatens sonakshi sinha

fan threatens sonakshi sinha

Sonakshi Sinha : బెదిరిపోయిందిగా…!

దాంతో సోనాక్షి సిన్హా భ‌య‌ప‌డి గార్డ్స్ అంటూ కేక‌లు వేసింది.అయితే ఇదంతా షోలో భాగంగానే చేసిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, దీనిపై ప‌లువురు ప‌లు ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తున్న ఈ అమ్మడు అందాలను నమ్ముకుని సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. మరోవైపు మాల్డీవుల్లో ఎంజాయ్‌ చేస్తూ బికినీ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. సోనాక్షి ఏం చేసిన అది ఇటీవ‌లి కాలంలో సెన్సేష‌న్‌గా మారుతుంది.

 

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp