Prabhas : అన్నా ఇలా అయితే చాలా కష్టం .. ప్రభాస్ మీద కోపంగా ఉన్న ఫ్యాన్స్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : అన్నా ఇలా అయితే చాలా కష్టం .. ప్రభాస్ మీద కోపంగా ఉన్న ఫ్యాన్స్ !

 Authored By prabhas | The Telugu News | Updated on :29 April 2023,5:00 pm

Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తో టాలీవుడ్ సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసేవన్ని పాన్ ఇండియా సినిమాలే. ఆ ఒక్క బాహుబలి సినిమాతో తన క్రేజ్ పూర్తిగా మారిపోయింది. దీంతో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, ప్రాజెక్టు కె, సలార్, రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నాడు. అయితే త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

fans are angry with prabhas

fans are angry with prabhas

దీని కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున దర్శకుడు ఓం రౌత్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ కేటాయించిన డేట్స్ కొన్నే. షూటింగ్ మొత్తం గ్రీన్ మ్యాట్ పైన పూర్తి చేశారు. కనుక ప్రమోషన్ కార్యక్రమాల కోసం ప్రభాస్ ఎక్కువ రోజులు కేటాయించే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం. మే 15 నుండి మొదలుకొని సినిమా విడుదల అయ్యేవరకు ఆది పురుష్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో ప్రభాస్ బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. జూన్ 16న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. అంటే నెలరోజుల పాటు ప్రభాస్ ఆది పురుష్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటాడు.

Prabhas marriage news

Prabhas marriage news

దేశవ్యాప్తంగా అనేక ముఖ్య పట్టణాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటు మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు ఇలా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ కోసం భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. అందులో టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఈ ఈవెంట్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది