JR NTR : జూనియర్ ఎన్టీఆర్‌ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

Authored By mallesh | The Telugu News | Published on: December 28, 2021, 1:40 pm

JR NTR : యంగ్ టైగర్, తారక్, జూనియర్, నందమూరి నటవారసుడు ఇలా ఎన్టీఆర్‌ను ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటుంటారు. తారక్ అంటే నందమూరి అభిమానులకు ప్రాణం. ఎందుకంటే ఎన్టీఆర్ సౌమ్యుడు. తియ్యగా పలకరిస్తాడు. ఫ్యాన్స్‌ను ఫ్యామిలీ మెంబర్స్‌గా భావిస్తారట. ఇక ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్‌కు వచ్చే అభిమానులను జాగ్రత్తలు చెబుతాడు. వాహనాలు నెమ్మదిగా డ్రైవ్ చేయాలని, సేఫ్టీ మెజర్స్ పాటించాలని, ఇంటి దగ్గర కుటుంబం మీకోసం ఎదురుచూస్తుందని చెప్పి పంపిస్తాడు. కారణం యాక్సిడెంట్స్ నందమూరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాయి. తండ్రి హరికృష్ణతో పాటు అన్నయ్య జానకి రామ్ కూడా ప్రమాదంలో మరణించారు.

ఈ విషాదాన్ని గుర్తుచేసుకుని తారక్ఇ ప్పటికీ బాధపడుతుంటారు.తారక్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఫ్యాన్స్ ఎప్పుడూ ఇలా వెయిటింగ్ చేయలేదట. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి బంధనంలో ఉన్నాడు. గతంలో తారక్ ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ వచ్చాడు. దీంతో అభిమానులకు కావాల్సినంత స్టఫ్ దొరికేది. తారక్ సినిమా హిట్ అయితే కాలర్ ఎగరేసుకుని మరి తిరిగేవారట.. అయితే, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ తర్వాత తారక్ మళ్లీ వెండితెరపై కనిపించక మూడేళ్లు అవుతుంది. 2018లో అభిమానులను పలకరించిన

fans eagarly waiting for JR ntr movie

fans eagarly waiting for JR ntr movie

JR NTR : తారక్ కోసం వేయికళ్లతో వెయిటింగ్

 తారక్.. 2019,20,21 వరకు ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కరోనా దెబ్బకు ఏకంగా మూడేళ్లు గడిచిపోయాయి.ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణతో కలసి ఆర్ఆర్ఆర్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 2021లో విడుదల కావాల్సి ఉన్నా జక్కన్న నిర్ణయాలతో ఏకంగా 2022 సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ ఏడాది బాలయ్య ‘అఖండ’తో వచ్చి అభిమానులకు అదిరిపోయే ఫుల్ మీల్స్ పెట్టాడు. ఇక అబ్బాయ్ వంతు వచ్చింది. మూడేళ్ల నిరీక్షణతో ఉన్న తారక్ ఫ్యాన్స్‌ను సంతృప్తి పరుస్తాడా? లేదా అనేది జనవరి 7 తర్వాత తెలియనుంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp