
fans fight about rrr movie
RRR : టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ హంగామా మొదలైంది. మార్చి 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటోంది. ఎంటైర్ యూనిట్ ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ఇదంతా ఒక వైపు కొనసాగుతుంటే, మరో వైపు ఇటు మెగా ఫ్యాన్స్..అటు నందమూరి ఫ్యాన్స్ పోటీ పడి తమ అభిమాన హీరోలు నటించిన సినిమాలను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.అయితే ఇప్పుడు సినిమా రిలీజ్‌కు ముందు భారీ ఎత్తున ప్రమోషన్లు జరుగుతోన్న వేళ ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది.
తాజాగా రిలీజ్ అయిన ఫొటో చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి జెండా పట్టుకున నిల్చొన్న ఫొటో ఇది. అయితే ఈ ఫొటో బయటకు వచ్చిన వెంటనే ఫ్యాన్ ఎడిట్‌లు మొదలైపోయాయి. ముందు మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను తీసేసి కేవలం చరణ్ జెండా ఎత్తుతోన్న ఫొటో ఉండేలా ఎడిట్ చేశారు. ఆ తర్వాత తారక్ ఫ్యాన్స్ దానికి రివర్స్‌లో చరణ్ ఫొటో తీసేసి తారక్ ఉండేలా ఫొటో ఎడిట్ చేశారు.తారక్ ఫ్యాన్స్ ఏం చెపుతున్నారంటే ఈ జెండా పట్టుకున్న విధానంలో పైన చరణ్ చేయి ఉందంటున్నారు. అక్కడ నుంచి డిస్కర్షన్లు స్టార్ట్ అయ్యాయి. మనదే పై చేయి.. కాదు మనదే పై చేయి అంటూ రకరకాలుగా ఇద్దరు హీరోల అభిమానులు ఆ పోస్టర్‌ను ఎడిట్ చేసుకున్నారు. చిన్న పోస్టర్ విషయంలోనే ఇంత వార్ నడుస్తుంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక.
fans fight about rrr movie
ఇద్దరు హీరోలను సమానంగా చూపించే విషయంలో ఏ చిన్న తప్పు దొర్లినా మరింత రచ్చ చేస్తారనడంలో సందేహం లేదు.ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏకంగా ఓ షో కోసం 75 టికెట్స్‌కొన్నాడు. కార్లతో RRR, ఎన్టీఆర్ అనే పేర్లు డిజైన్ చేసి హల్ చల్ చేస్తున్నారు కొందరు. మరి కొందరైతే మరో అడుగు ముందుకేసి ఫ్లైట్ బుక్ చేసి దాని చివరలో తొక్కుకుంటూ పోవాలే అనే డైలాగ్ రాసిన బ్యానర్‌ను కట్టి, జై ఎన్టీఆర్ అంటూ తిరిగారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే.. మేం మాత్రం ఎందులో తక్కువ అని అంటున్నారు. 15 కుటుంబాలకు చెందిన మెగా ఫ్యాన్స్ అమెరికాలో పిట్‌బర్గ్స్‌లో -11 డిగ్రీల చలిలో 30 మైళ్ల వేగంతో వీస్తున్న చలి ఈదుర గాలుల మధ్య రామ్ చరణ్‌కు అభినందనలు చెప్పారు.
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…
Habits : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…
Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…
Peddi Pre-Release Event : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం…
This website uses cookies.