
Samantha Shares The Mystery Of Marilyn Monroe The Unheard Tapes
Samantha : మహేష్ భట్ గారాల పట్టి అలియా భట్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా పేరు ప్రఖ్యాతలు పొందిన అలియా భట్ కెరీర్‌లో భిన్నమైన ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఇటీవల గంగూభాయ్ కతియావాడి సినిమాతో ప్రేక్షకులని పలకరించిన అలియా భట్ మార్చి 25న ఆర్ఆర్ఆర్ సినిమాతో పలకరించనుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో కలిసి తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అంత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించాడు.అలియాపై తెగ ప్రేమ కురిపించిందిగా..ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
ఇదిలా ఉంటే నేడు అలియా బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చి 15న అలియా 29వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అయాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అలియా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తూ సర్‌ప్రైజింగ్ వీడియో షేర్ చేశాడు. కాగా ఇందులో అలియా పాత్ర పేరు ఇషా. ఈమె లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే అలియా భట్ బర్త్ డే సందర్భంగా ఆమెకు సన్నిహితులు, శ్రేయోబిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అందాల ముద్దుగుమ్మ సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రాములో అలియాకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ..నువ్వు చేయలేనిది ఏమైన ఉందా? నువ్వు సాధించే విజయాలను సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండు అంటూ అలియాపై తెగ ప్రేమ కురిపించింది సమంత.
samantha comments on birthday Girl alia bhatt
గంగూబాయ్ కతియావాడి సినిమా రిలీజ్ సమయంలోను అలియాపై ప్రశంసలు కురిపించింది. చిత్రం ఒక కళాఖండం. అలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవడం లేదు. ప్రతీ ఒక్క డైలాగ్, హావాభావాలు నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి` అంటూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పేర్కొంది సమంత. కాగా, గ్లామర్ రోల్స్‌తోనే కాకుండా వైవిధ్యభరితమైన నాయికా ప్రాధాన్యత కథలు ఎంచుకుంటూ దూసుకెళ్తోంది బాలీవుడ్ క్యూట్గుమ్మ అలియా భట్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’లో అలియా సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
samantha comments on birthday Girl alia bhatt
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.