Rashmika mandanna : ‘రష్మిక మందన్నా’ అందాలకు ఫ్యాన్స్ ‘ఫిదా’.. బ్లాక్ సారీలో ఏముందిరా అంటూ..?

 Authored By mallesh | The Telugu News | Updated on :13 December 2021,4:20 pm

Rashmika mandanna : రష్మిక మందన్నా.. ఈ ఒక్క పేరు వింటే చాలు.. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ అభిమానులు ఒక్కసారిగా కలవరానికి గురవుతున్నారట.. ఎందుకంటే ఈ అమ్మడి అందం అలాంటిది. చూసేందుకు చిన్నపిల్లలా కనిపించే రష్మిక తన అందం, అభినయం, స్మైల్ తోనే కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కన్నడకు చెందని ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్లకు షాక్ ఇచ్చింది. వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటోంది. కుర్ర హీరోలతో ప్రారంభమైన ఈ అమ్మడు జర్నీ మొన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో కనిపించి తన నటనతో అందరినీ మెప్పించింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ మూవీలో శ్రీవల్లి పాత్రలో డీ గ్లామరస్ రోల్ చేసింది.

తెలుగులో హీరో నాగశౌర్యకు జోడిగా చలో మూవీలో నటించింది రష్మిక. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఈ అమ్మడు ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరోవైపు తమిళం, కన్నడ, బాలీవుడ్ ప్రాజెక్టులను సైతం ఓకే చేసేస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక అప్పుడప్పుడు వెకేషన్స్ కూడా ప్లాన్ చేస్తుంటుంది. మొన్నీ మధ్య పుష్ప మూవీ షూటింగ్‌లో కాస్త విరామం దొరకక తన బెస్ట్ ఫ్రెండ్ విజయ దేవరకొండ కోసం అమెరికాకు వెళ్లినట్టు జోరుగా వార్తలు వచ్చాయి. ఫిట్‌నెస్ విషయంలోనూ రష్మిక ఎక్కడా తగ్గడం లేదు.

fans flat for rashmi mandanna beauties in black saree

fans flat for rashmi mandanna beauties in black saree

Rashmika mandanna : చలో మూవీతో మొదలై..

తాజాగా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్నా బ్లాక్ సారీలో కనిపించింది. కలర్ ఫుల్ లైటింగ్ మధ్య ఈ క్యూట్ అందాల సుందరి మరింత గ్లామర్‌గా కనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ సారీలో అర్ధరాత్రి వచ్చిన చందమామ లాగా రష్మిక ఉందని, ఆ నవ్వు ఆకాశంలోని నక్షత్రాలను కూడా డామినేట్ చేస్తున్నాయని ఫ్యాన్స్ ఏకంగా కవితలను రాస్తేస్తున్నారు. ఏదైమైనా బక్కపలుచని అందంతో అందరినీ మంత్రముగ్దులను చేస్తోంది అందాల రష్మిక..

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి