ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో డేటింగ్‌.. ప్ర‌భాస్‌తో మ్యారేజ్.. ఈ భామ మాముల్ది కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో డేటింగ్‌.. ప్ర‌భాస్‌తో మ్యారేజ్.. ఈ భామ మాముల్ది కాదు

 Authored By ramu | The Telugu News | Updated on :6 May 2025,8:00 pm

తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోయిన్ గా పేరుపొందిన ఫరియా అబ్దుల్లా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తన అందంతో, హైట్ తో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించి బాగానే పేరు సంపాదించుకున్న ఫరియా తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవలే యాంకర్ సుమ నిర్వహించినటువంటి చాట్ షో ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది.

ఇదేం పిచ్చి..

ఈ ప్రోగ్రాంలో యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు వేయగా అందుకు సమాధానాలు తెలియజేసింది ఫరియా అబ్దుల్లా.. నీకు అవకాశం వస్తే ఎవరితో డేటింగ్ కి వెళ్తావు? ఎవరిని వివాహం చేసుకుంటావు అంటూ సుమా ప్రశ్నించగా అందుకు ఫరియా ఇలా తెలియజేస్తూ తనకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో డేటింగ్ చేస్తానని వివాహం చేసుకోవాల్సి వస్తే ప్రభాస్ ని చేసుకుంటానంటూ తెలియజేసింది ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో డేటింగ్‌ ప్ర‌భాస్‌తో మ్యారేజ్ ఈ భామ మాముల్ది కాదు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో డేటింగ్‌.. ప్ర‌భాస్‌తో మ్యారేజ్.. ఈ భామ మాముల్ది కాదు

ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ,పవన్ ఫ్యాన్స్ సైతం విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇది తమ అభిమాన హీరోల క్రేజ్ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఫరియా వరుస చిత్రాలతో నటిస్తూ ఉన్నప్పటికీ ఈమె కెరీర్ కు సరైన సక్సెస్ మాత్రం పడడం లేదు మొదట డాన్సర్ గా తన కెరీయర్ని మొదలుపెట్టి ఆ తర్వాత నటన పైన ఇంట్రెస్ట్ ఉండడంతో జాతి రత్నాలు సినిమా ఆడిషన్ కు వెళ్లిందట. అలా తనకి మొదటి సినిమా అవకాశం రావడంతో అదే ఈ అమ్మడికి ప్లస్ అయింది. ఈ అమ్మ‌డిని చిట్టి అని అంద‌రు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది