Bigg Boss Telugu 7 : శుభశ్రీకి ఇస్తే మేమేం చేయాలి.. మాస్టర్‌పై అమర్‌దీప్ సీరియస్.. మూడో కంటెండర్ విషయంలో మళ్లీ గొడవ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss Telugu 7 : శుభశ్రీకి ఇస్తే మేమేం చేయాలి.. మాస్టర్‌పై అమర్‌దీప్ సీరియస్.. మూడో కంటెండర్ విషయంలో మళ్లీ గొడవ

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మాత్రం మాంచి జోరుమీదుంది. గత సీజన్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ సీజన్ మరో ఎత్తు. అవును.. హౌస్ లోకి కంటెస్టెంట్ల మధ్య బిగ్ బాస్ కావాల్సినంత మంట పెడుతున్నాడు. ఎప్పటికప్పుడు గొడవలు లేపి సైలెంట్ గా కూర్చొంటున్నాడు బిగ్ బాస్. తాజాగా అదే జరిగింది. నిజానికి హౌస్ లో గేమ్స్ కంటే గొడవలే ఎక్కువయ్యాయి. ప్రేక్షకులకు కూడా కావాల్సింది అదే. అందుకే […]

 Authored By kranthi | The Telugu News | Updated on :29 September 2023,12:00 pm

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మాత్రం మాంచి జోరుమీదుంది. గత సీజన్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ సీజన్ మరో ఎత్తు. అవును.. హౌస్ లోకి కంటెస్టెంట్ల మధ్య బిగ్ బాస్ కావాల్సినంత మంట పెడుతున్నాడు. ఎప్పటికప్పుడు గొడవలు లేపి సైలెంట్ గా కూర్చొంటున్నాడు బిగ్ బాస్. తాజాగా అదే జరిగింది. నిజానికి హౌస్ లో గేమ్స్ కంటే గొడవలే ఎక్కువయ్యాయి. ప్రేక్షకులకు కూడా కావాల్సింది అదే. అందుకే బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకులకు తెగ నచ్చేస్తోంది. కిచెన్ లో గొడవే.. నామినేషన్ల విషయంలో గొడవే. ఏదైనా టాస్క్ వస్తే అక్కడా గొడవే. అసలు గొడవ లేని రోజు లేదు. గొడవ పడని వాళ్లు లేరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఓ కిక్కు ఉంది. అందుకే ప్రేక్షకులు కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు.

ఇక.. అసలు విషయానికి వస్తే నాలుగో పవరాస్త్ర కోసం ప్రస్తుతం హౌస్ లో టాస్క్ నడుస్తోంది. ఇప్పటికే యావర్, ప్రశాంత్ ఇద్దరు నాలుగో పవరాస్త్ర కోసం కంటెండెర్స్ అయ్యారు. ఇక.. మూడో కంటెండర్ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. అదే బిగ్ బాస్ గాలా ఈవెంట్. ఈ ఈవెంట్ లో ఎవరైతే మంచిగా డ్రెస్సులు వేసుకొని సరదాగా డ్యాన్సులు వేసుకొని ఈవెంట్ నిర్వాహకులను మెప్పిస్తారో వాళ్లలో ఒకరిని మూడో కంటెండర్ గా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసే అవకాశం మళ్లీ హౌస్ మెంట్స్ అయిన శివాజీ, శోభా శెట్టి, సందీప్ కే ఇచ్చాడు బిగ్ బాస్. అయితే.. కంటెస్టెంట్లు అందరూ రకరకాల డ్రెస్సులు వేసుకొని తెగ హడావుడి చేశారు. ఒక్కొక్కరు తమకు నచ్చిన డ్రెస్సులు వేసుకొని నిర్వాహకులను మెప్పించే ప్రయత్నం చేశారు. కానీ.. శుభశ్రీ గెటప్ మాత్రం వాళ్లను ఆకట్టుకుంది. దీంతో మూడో కంటెండర్ గా శుభశ్రీని ప్రకటించారు. దీంతో ఒక్క నిమిషం మాస్టారు అంటూ వెంటనే అమర్ దీప్ లేస్తాడు. మీకు ఎంటర్ టైన్ మెంట్ అక్కడ ఏం దొరికింది. నేను మీకు ఏం ఇవ్వలేదు అని అడుగుతాడు అమర్ దీప్.

fight between amar and sandeep in bigg boss 7 telugu

#image_title

Bigg Boss Telugu 7 : శుభశ్రీ గెటప్ కే నిర్వాహకుల ఓటు

కావాల్సిన వాళ్లకు ఇచ్చుకుంటూ పోవడం కాదన్నా అంటాడు అమర్ దీప్. దీంతో సుబ్బు ఇన్నోవేటివ్ గా అనిపించింది. ఆయన చెప్పిన డ్రెస్సుల ప్రకారం.. మీరు రూల్ బుక్ చూడండి అని అంటాడు శివాజీ. అవి వాడుకోమని చెప్పారు కానీ… అది చెప్పలేదు సార్ అంటూ అమర్ దీప్ కోప్పడతాడు. కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది