Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ ఏంది? అమర్‌ను టార్గెట్ చేయడం ఏంటి? తక్కువ ఓట్లు వచ్చిన ప్రశాంత్‌ను విన్నర్‌ను చేసి ఎక్కువ ఓట్లు వచ్చిన అమర్‌ను రన్నర్‌ను ఎందుకు చేశాడు బిగ్ బాస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ ఏంది? అమర్‌ను టార్గెట్ చేయడం ఏంటి? తక్కువ ఓట్లు వచ్చిన ప్రశాంత్‌ను విన్నర్‌ను చేసి ఎక్కువ ఓట్లు వచ్చిన అమర్‌ను రన్నర్‌ను ఎందుకు చేశాడు బిగ్ బాస్

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ ను ప్రకటించిన తర్వాత ఇది చాలా క్లోజ్ కాల్. మీ ఇద్దరి మధ్య ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదు. ఇద్దరి మధ్య ఓట్ల శాతం చాలా తక్కువ అంటూ చెప్పుకొచ్చారు హోస్ట్ నాగార్జున. అయితే.. పల్లవి ప్రశాంత్ నే విన్నర్ ను చేయాలని బిగ్ బాస్ ముందే డిసైడ్ అయ్యాడా? […]

 Authored By kranthi | The Telugu News | Updated on :18 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  అమర్ దీప్ ఫ్యాన్స్ వర్సెస్ ప్రశాంత్ ఫ్యాన్స్

  •  అమర్ దీప్ పై రెచ్చిపోయిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్

  •  ఇది ఫ్యాన్స్ వారా? లేక కంటెస్టెంట్ల మధ్య వారా?

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ ను ప్రకటించిన తర్వాత ఇది చాలా క్లోజ్ కాల్. మీ ఇద్దరి మధ్య ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదు. ఇద్దరి మధ్య ఓట్ల శాతం చాలా తక్కువ అంటూ చెప్పుకొచ్చారు హోస్ట్ నాగార్జున. అయితే.. పల్లవి ప్రశాంత్ నే విన్నర్ ను చేయాలని బిగ్ బాస్ ముందే డిసైడ్ అయ్యాడా? అసలు ఎక్కువ ఓట్లు వచ్చింది పల్లవి ప్రశాంత్ కు కాదని.. అమర్ దీప్ కే అని అమర్ ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినా కూడా ఆయన ఫ్యాన్స్ ఎందుకు అమర్ ను టార్గెట్ చేశారు. అసలు అమర్ చేసిన తప్పేంటి. బిగ్ బాస్ పేరుతో రోడ్డు మీద ఈ రచ్చ ఏంది. పబ్లిక్ ను డిస్టర్బ్ చేయడం ఏంటి. పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజీ చేయడం ఏంటి. అసలు ఏంది ఇది బిగ్ బాస్. ఇదంతా నువ్వు చూస్తున్నావా? ఇంత దారుణం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. బిగ్ బాస్ యాజమాన్యం ఏం చేస్తున్నారు. ఈసమయంలో హోస్ట్ నాగార్జున ఎక్కడికెళ్లారు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అయితే.. దానికంటే ముందు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటుంది. అదే పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మధ్య గొడవ. నిజానికి డే వన్ నుంచి పల్లవి ప్రశాంత్ ను అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి ఈ ముగ్గురు టార్గెట్ చేశారు. ఆ తర్వాత సందీప్ మాస్టర్, గౌతమ్ కూడా టార్గెట్ చేశారు. ఒక్క శివాజీ, యావర్ తప్ప మిగితా వాళ్లంతా హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేసిన వాళ్లే. దానికి కారణం.. పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్. సాధారణ వ్యక్తి సెలబ్రిటీల మధ్య హౌస్ లో 105 రోజులు ఉండి చివరికి విజేత కావడం అనేది మామూలు విషయం కాదు. అది గ్రేట్ అనే చెప్పుకోవాలి. అయితే.. పల్లవి ప్రశాంత్ ను బిగ్ బాస్ విజేతను చేయాలని ముందే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఆ మధ్య బిగ్ బాస్ హౌస్ కు తొలి కెప్టెన్ అయిన పల్లవి ప్రశాంత్.. తను సరిగ్గా కెప్టెన్సీ చేయలేదని చెప్పి ప్రశాంత్ కెప్టెన్సీని రద్దు చేస్తాడు బిగ్ బాస్. అప్పుడు కానీ తెలియలేదు బిగ్ బాస్ కి పల్లవి ప్రశాంత్ కు బయట ఉన్న క్రేజ్. వెంటనే అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో వద్ద చాలా గొడవ చేశారు. రచ్చ రచ్చ చేశారు. నానా యాగీ చేశారు. దీంతో బిగ్ బాస్ మళ్లీ పల్లవి ప్రశాంత్ ను కెప్టెన్ ను చేశాడు. దీంతో ప్రశాంత్ ఫ్యాన్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంటే.. పల్లవి ప్రశాంత్ కు వ్యతిరేకంగా బిగ్ బాస్ ఏ పని చేసినా.. అది రివర్స్ కొట్టి బిగ్ బాస్ షోకే మచ్చ తెచ్చే అవకాశం ఉందని బిగ్ బాస్ యాజమాన్యం ముందే గ్రహించింది. అందులోనూ ప్రశాంత్ కూడా తన ఆట తీరును మెరుగుపరుచుకొని రోజురోజుకూ రాటుతేలాడు. టాప్ 5 లో చోటు కూడా సంపాదించుకున్నాడు.

Pallavi Prashanth : అమర్ దీప్ ను విన్నర్ ను చేస్తే ప్రశాంత్ ఫ్యాన్స్ ఊరుకోరనే బిగ్ బాస్ పక్కా ప్లాన్

ఒకవేళ ప్రశాంత్ కు తక్కువ ఓట్లు వచ్చినా ప్రశాంత్ ను కాకుండా అమర్ దీప్ ను విన్నర్ ను చేస్తే ఇక మామూలుగా ఉండేది కాదు రచ్చ. ఎందుకంటే.. బిగ్ బాస్ యాజమాన్యం అమర్ దీప్ ను విన్నర్ ను చేయాలని ముందే అనుకుందట. కానీ.. అమర్ దీప్ కు మధ్యలో పల్లవి ప్రశాంత్ వచ్చేశాడు. అందులోనూ హౌస్ లో ప్రతి సారి పల్లవి ప్రశాంత్ ను అమర్ దీప్ చిన్నచూపు చూడటం, తిట్టడం, రైతు అయితే ఏంటి.. రైతు బిడ్డ అయితే ఏంటి అంటూ రైతులను కూడా చిన్నచూపు చూడటంతో బయట జనాలు కూడా సీరియస్ గా తీసుకున్నారు. అమర్ దీప్ పై ప్రశాంత్ ఫ్యాన్స్ పగ పెంచుకున్నారు. ఇప్పుడు అమర్ దీప్ ను విన్నర్ ను చేస్తే బయట అమర్ దీప్ పని అయిపోయేది. అసలు ప్రశాంత్ విన్నర్ అయినా కూడా అమర్ రన్నర్ అయినా కూడా ప్రశాంత్ ఫ్యాన్స్ బయట ఎంత రచ్చ చేశారో తెలుసు కదా. అమర్ కారు అద్దాలను పగులగొట్టారు. ఒకానొక సమయంలో రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకొని అమర్ తలదాచుకున్నాడు అంటే.. అమర్ పై ప్రశాంత్ ఫ్యాన్స్ ఎంత కక్ష కట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బిగ్ బాస్ ముందే ఊహించి.. ఒకవేళ అమర్ కు ఎక్కువ ఓట్లు వచ్చినా అమర్ ను విన్నర్ ను చేస్తే ప్రశాంత్ ఫ్యాన్స్ పెంట పెంట చేస్తారని.. బిగ్ బాస్ మీద ఉన్న నమ్మకం కూడా జనాల్లో పోతుందని.. అందుకే ప్రశాంతనే చేసేస్తే పోలా అన్నట్టుగా అమర్ ను తప్పని సరి పరిస్థితుల్లో రన్నర్ ను చేసినట్టుగా కనిపిస్తోంది. చివర్లో అసలు ట్విస్ట్ నాగ్ రివీల్ చేయడంతో అసలు విన్నర్ అమర్ అని స్టేజీ మీదనే తేలిపోయింది. ఇది క్లోజ్ కాల్. ఓట్ల శాతం మీ ఇద్దరి మధ్య చాలా తక్కువ అని చెప్పినప్పుడే ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. అసలు విన్నర్ అమర్ కానీ.. ప్రశాంత్ కాదని. ఏది ఏమైనా ప్రశాంత్ కూడా హౌస్ లో చాలా కష్టపడ్డాడు. టాప్ పొజిషన్ సాధించాడు. కానీ.. ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం ఇంతలా రచ్చ చేయకుండా ఉండాల్సింది. అది ప్రశాంత్ కే బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే అవకాశం ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది