Home » Entertainment » Fight Between Contestants About Food In Bigg Boss Telugu 7
Entertainment

Bigg Boss Telugu 7 : ఏంట్రా మీ చిల్లర పంచాయతీ.. కిచెన్‌లోనూ తిండికాడ లొల్లేనా.. థూ అంటున్న ప్రేక్షకులు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: September 28, 2023, 1:00 pm
Advertisement

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకూ ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అక్కడ పక్కాగా రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకటి స్టార్ మా గ్రూప్ కాగా, ఇంకోటి శివాజీ గ్రూప్. స్టార్ మా గ్రూపులో ప్రియాంక, అమర్ దీప్, శోభ, ఆట సందీప్, తేజ ఉండగా.. శివాజీ గ్రూప్ లో ప్రశాంత్, యావర్ ఉన్నారు. అయితే.. గౌతమ్, శుభశ్రీ.. ఈ ఇద్దరు మాత్రం ఎవరి గ్రూప్ అవసరం అయితే ఆ గ్రూప్ వైపు వెళ్తారు. ఇక రతిక గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా స్టార్ మా బ్యాచ్ వల్ల హౌస్ లో చిల్లర పంచాయతీలు మాత్రం పెరుగుతున్నాయి. వాళ్ల వల్లనే చిల్లర లొల్లి జరుగుతోంది. ముఖ్యంగా స్టార్ మా బ్యాచ్ లోని శోభా శెట్టి మాట్లాడితేనే సగటు ప్రేక్షకుడికి చిర్రెత్తుకొస్తోంది. దానికి కారణం.. ఆవిడ ప్రవర్తించే తీరు. వామ్మో.. మాట్లాడితే చాలు.. నోరు నెత్తినపెట్టుకుంటుంది. వామ్మో తల్లి నీతో ఎవ్వరూ పెట్టుకోలేరు. నువ్వు ఎప్పుడు ఎలిమినేట్ అవుతావా అని ఎదురు చూస్తున్నాం అని ప్రేక్షకులు వాపోతున్నారు.

Advertisement

నిజానికి శోభా శెట్టి మూడో వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ.. కావాలనే బిగ్ బాస్ శోభా శెట్టి కంటెండర్ టాస్క్ గెలిచినట్టుగా, చివరకు పవరాస్త్రను కూడా శోభా శెట్టి గెలుచుకున్నట్టుగా చేశాడు. దీంతో ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. దామిని ప్లేస్ లో శోభా శెట్టి ఉండేది. దామిని శోభా శెట్టి కన్నా వంద శాతం నయం అని అంటున్నారు. కానీ.. దామినిని ఎలిమినేట్ చేసి శోభా శెట్టిని మరో మూడు వారాల వరకు సేవ్ చేయడం వెనుక బిగ్ బాస్ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ 25వ రోజుకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. అందులో కిచెన్ లో చిల్లర పంచాయతీ పెట్టుకున్నారు కంటెస్టెంట్లు. యావర్ బయటికెళ్లి తింటున్నాడని.. ఇప్పటి వరకు చాలా రోటీలు తిన్నాడని, ఆమ్లెట్ తిన్నాడని, రైస్ కూడా తింటున్నాడని మాస్టర్ మండిపడతాడు. యావర్ లోపలికి రాగానే నువ్వు ఒక్కడివే అక్కడికెళ్లి ఎందుకు తింటున్నావు అని అడుగుతాడు. దీంతో మీకు ఏదైనా సమస్య ఉందా? మీరు కూడా వెళ్లి తినండి అంటాడు. దీంతో శివాజీ కూడా అతడిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో ఆ పంచాయతీ కాస్త శివాజీ మీదికి వెళ్తుంది.

#image_title

Advertisement

Bigg Boss Telugu 7 : మీకు కూడా అక్కడికి ఆమ్లేట్లు వేసి తీసుకొస్తున్నారు కదా?

యావర్ ను అలా మాస్టర్ డైరెక్ట్ గా అడిగే సరికి.. కోపంతో యావర్ ప్లేట్ అక్కడే పెట్టి వెళ్తాడు. దీంతో మాస్టర్ కి ఇంకా కోపం వస్తుంది. శోభా శెట్టికి కూడా కోపం వస్తుంది. ప్లేట్ అలా వదిలి వెళ్లొద్దు అంటుంది శోభా. కానీ.. యావర్ వినడు. ఫుడ్ వేస్ట్ చేయకు అంటాడు మాస్టర్. దీంతో నాకు తినాలనిపించడం లేదు అంటాడు యావర్. ఆమ్లెట్ కావాలంటే చాలామందికి ఇస్తారు కదా అని శివాజీ అంటాడు. ఇక్కడ అందరూ తింటున్నారు కదా. వాడు బర్జర్ దగ్గరే కూర్చొని ఎందుకు తినాలి అంటాడు మాస్టర్. దీంతో నువ్వు కూడా అక్కడ కూర్చొని తిను.. నిన్ను ఎవరు వద్దన్నారు అంటాడు యావర్. జనాలు చూస్తున్నారు కదా. వాళ్లే చూసుకుంటారు అంటాడు శివాజీ. దీంతో ప్రతి సారి జనాలు జనాలు అంటారు మీరు అంటుంది శోభా శెట్టి. దీంతో జనాలు అవసరం లేదు అని నువ్వే అంటావు కదా అని శివాజీ అనడంతో.. ఇదే రాంగ్ గా మీరు జనాల్లోకి నన్ను తీసుకెళ్లాలని అనుకుంటున్నారు అంటుంది శోభా శెట్టి. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి