Sr NTR : నందమూరి తారక రామారావు..ఈ ఒక్క పేరు చాలు సంచనాలకు ప్రతీక..కొన్ని దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశారు. రాష్ట్ర ప్రజలను తన కుటుంబంలా చూసుకునే వారని అప్పట్లో చాలా మంది ఆయన్ను కీర్తించేవారు.అయితే, ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో కుటుంబం ప్రేమకు దూరమై చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. అందుకు ఆయన లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకోవడమే కారణమని కూడా అంటారు.
నందమూరి తారక రామారావు గారు సినీ జీవితంలో ఎంతో బిజీగా ఉండేవారట. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇంటికి వచ్చి మళ్లీ ఉదయం 6 గంటల వరకే షూటింగ్ స్పాట్‌కు వెళ్లిపోయేవారట.. టైమింగ్ విషయంలో ఎన్టీఆర్ కుటుంబానికి ఇప్పటికీ చాలా సీరియస్ నెస్ ఉంటుందని అంటుంటారు. ఈ విషయాన్ని అప్పట్లో దాసరి నారాయణరావు సహా నేటితరం దర్శకులు చెబుతుంటారు. ఆయన సినిమాల కంటే ఇంటికి చాలా తక్కువ సమయం కేటాయించే వారని అనే వారు కూడా ఉన్నారు. అయితే, నటుడు గుమ్మడి రాసిన పుస్తకంలో అన్నగారు కుటుంబం పట్ల ఎంత శ్రద్ధ తీసుకునే వారో వివరించారు.రామారావుకు సినిమాల పట్ల ఎంత భక్తి, శ్రద్ధలు ఉండేవో కుటుంబం విషయంలోనూ అంతే శ్రద్ధ ఉండేదని పేర్కొన్నారు. ఆయన ఎవరికీ ఎలాంటి లోటు చేయలేదని పేర్కొన్నారు.
ఔట్ డోర్ షూటింగుల టైంలో తప్పా మిగిలిన సమయాల్లో కుటుంబానికి ఆయన చాలా ప్రాధాన్యం ఇచ్చేవారట. ఇక అక్కినేని నాగేశ్వర్రావు కూడా ఎన్టీఆర్ లాగే చాలా బిజీగా ఉండేవారట..ఆయన కుటుంబాన్ని తన భార్య అన్నపూర్ణ చూసుకునేదట.. కానీ ఎన్టీఆర్ గారు మాత్రం అటు సినిమాలు, ఇటు కుటంబాన్ని చూసుకునేవారని.. ఆయనకు టైం ఎలా కుదిరేదో అర్థం కాలేదని అక్కినేని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారట.. అంతేకాకుండా తన పెద్ద కొడుకు హరికృష్ణను స్కూల్‌కు తీసుకువెళ్లి, తీసుకువచ్చేవాడని కూడా అక్కినేని చెప్పేవారట.. ఎన్టీఆర్ తన పిల్లలకు సరైన సంబంధాలు చూసి మంచి కుటుంబాలకు ఇచ్చారని..కోడళ్లను కూడా ఉన్నత కుటుంబాల నుంచి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఎన్టీఆర్ చాలా బిజీగా ఉండే టైంలో ఆయన తమ్ముడు త్రివిక్రమరావు కుటుంబ బాధ్యతలు చూసుకునే వారట..
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.