Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా ముందుకు వచ్చిన విషయం తెలిసింది. ఆ సినిమా ను 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించాడు. సినిమా కు భారీగా బడ్జెట్ ఖర్చు చేసిన కూడా నందమూరి కళ్యాణ్ రామ్ గత సినిమాల నేపథ్యం లో ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో దిల్ రాజు కు సినిమాను చూపించి అతి తక్కువ ధరకు ఆయనకు అమ్మినట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాను కేవలం రూ. 19 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా దిల్ రాజు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు హక్కులను దర్శించుకున్నాడు.
సినిమా దాదాపుగా 50 కోట్ల రూపాయల వసూళ్లను దక్కించుకుంది. అందులో దిల్ రాజుకి భారీ మొత్తం లాభాలు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో నందమూరి కళ్యాణ్ రామ్ కి పెద్దగా లాభం వచ్చినట్లుగా ఏమీ లేదు. సినిమా కి 40 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన కారణంగా థియేటర్ రిలీజ్ ద్వారా పాతిక నుండి 27 కోట్లు, ఓటీటి మరియు ఇతర రైట్స్ ద్వారా మరో రూ. 15 కోట్ల వరకు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తంగా సినిమా పెట్టిన పెట్టుబడి వెనక్కు రాబట్టింది కానీ నందమూరి కళ్యాణ్ రామ్ కి భారీగా లాభాలను అయితే తెచ్చిపెట్ట లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఈ సినిమాతో మంచి హిట్ అయితే కళ్యాణ్ రామ్ కి అందింది అంటూ సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార 2 సినిమాకు సంబంధించిన వర్కులో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాకు దాదాపుగా రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. సినిమా ను 40 నుండి 50 కోట్ల వరకు థియేట్రికల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ను చేసి ఆ సినిమాతో భారీ ఎత్తున లాభాలను దక్కించుకోవాలని ఆయన బలంగా నమ్మకంగా ఉన్నాడు. ఈ సమయంలో నందమూరి కళ్యాణ్ రామ్ మరియు ఆయన దర్శకుడు బిబిసార సినిమాకు సంబంధించి సీక్వెల్ స్క్రిప్టును రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అతి త్వరలోనే బింబిసార 2 సినిమా ను ప్రారంభిస్తారని కూడా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.