Home » Entertainment » Galipatala Sudhakar Jabardasth And Film Industry Journey
Entertainment

Jabardasth Sudhakar : జబర్దస్త్‌ లేకుంటే గాలి పటాల సుధాకర్‌ కెరీర్‌ పరిస్థితి ఏంటి?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: October 8, 2022 4:29 pm
Advertisement

Jabardasth Sudhakar : ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంది కమెడియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కమెడియన్స్ గా ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది జబర్దస్త్ నుండి వచ్చిన వాళ్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ నుండి వచ్చిన వాళ్ళు ఏకంగా హీరోలుగా కూడా పేరు సంపాదిస్తున్నారు. సుడిగాలి సుదీర్ ఇప్పటికే హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాల్లో అవకాశాల కోసం ఐదు, పది, పదిహేను సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ చేస్తూ విసిగి వేసారి పోయిన వారికి కూడా జబర్దస్త్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది అనడంలో సందేహం లేదు.అలాంటి వ్యక్తుల్లో ఒకరు గాలిపటాల సుధాకర్..

Advertisement

ఆయన ఎంతో సీనియారిటీ ఉన్న ఆర్టిస్ట్. ఆయనకు ఎన్నో స్టేజ్ షోలు చేసిన అనుభవం ఉంది, అయినా కూడా సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చేందుకు ఏ ఒక్కరు ముందుకు వచ్చే వాళ్ళు కాదు. ప్రతిభ ఉన్న కూడా ఫలితం లేకుండా గడుపుతున్న రోజుల్లో జబర్దస్త్ నుండి టీమ్‌ లీడర్స్ గాలి పటాల సుధాకర్ ని తీసుకొచ్చారు. అలా గాలిపటాల సుధాకర్ అనూహ్యంగా జబర్దస్త్ లో అడుగు పెట్టి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు రకరకాల కార్యక్రమాల్లో కూడా ఛాన్స్ దక్కించుకున్న సుధాకర్ ఒకవేళ జబర్దస్త్ కనుక లేకపోయి ఉంటే తన కెరీర్ ని ఊహించుకోవడమే అసాధ్యం అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

galipatala sudhakar jabardasth and film industry journey

Advertisement

తాను జబర్దస్త్ కి రుణపడి ఉంటానని, ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న తనకు అవకాశం దక్కలేదని ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న తనకు జబర్దస్త్ లో ఒక మంచి అవకాశం దక్కిందని.. దానిని తాను సద్వినియోగం చేసుకొని సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తున్నానని, ఇప్పుడు గాలిపటాల సుధాకర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది గుర్తుపడతారు అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. ఇలా ఎంతో మందికి జబర్దస్త్ జీవితంను ఇచ్చింది. ఒకప్పుడు తినడానికి తిండి లేక ఇబ్బంది పడ్డాం అంటూ చెప్పిన వాళ్లే ఇప్పుడు కార్లలో తిరుగుతూ సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ఎంతో మందికి జీవితాన్నిచ్చిన జబర్దస్త్ మరింత కాలం కొనసాగాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు మనము అదే కోరుకుందాం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి