Bigg Boss 8 Telugu : అడ్డంగా బుక్ అయిన అవినాష్.. ఆయనని పంపించాల్సిందే అంటున్న గంగవ్వ
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడిప్పుడే ఊపందుకుంది. గత సీజన్ తో పోల్చితే ఈసారి ప్రేక్షకులని అంతగా ఆకట్టుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఏదో వచ్చాం ఆడుతున్నాం అన్నట్టుగానే కంటెస్టెంట్స్ తీరు ఉంది. ఈ సారి కంటెస్టెంట్స్‌ని రెండు గ్రూపులుగా విభజించారు. కొత్త వారికి ఓజీ క్లాన్ అని వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన టీమ్ కు రాయల్ క్లాన్ అని విడదీశాడు బిగ్ బాస్. ఇక వీరి మధ్య రకరకాల గేమ్స్, టాస్క్ లు ఇస్తున్నాడు. కాగా ఉదయం పూట ఎవరైనా నిద్రపోతే కుక్కలు అరిచే సౌండ్ వేస్తారు. అయితే నిన్న అవినాష్-మెహబూబ్ ఇద్దరూ నిద్రపోతుంటే ఆ ఇద్దరినీ గార్డెన్ ఏరియాకు పిలిచాడు.
అక్కడ చిన్న కప్పుల్లో కాఫీ, వయొలిన్ ఉంచాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. అవినాష్ మీరు ఇప్పటికే చాలా సార్లు కాఫీ, వయొలిన్ అడిగారు కదా అని బిగ్ బాస్ చెప్పగానే.. బిగ్‌బాస్ నేను అడిగింది.. ఒళ్లు నొప్పులు తగ్గడానికి కొట్టే పెయిన్ రిలీఫ్ వాలినీ స్ప్రే అంటూ చెబుతాడు.అక్టోబర్ 18వ తేది ఎపిసోడ్‌లో ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ కంటిన్యూ అయింది. ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో రాయల్ అండ్ ఓజీ క్లాన్స్‌కు బిగ్ బాస్ ఓ ఛాలెంజ్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో కొన్ని గుర్తులు ఉన్న కుషన్స్ ఉంచారు. ప్లాస్మాలో చూపించిన సింబల్ ఉన్న కుషన్స్‌ను తీసుకెళ్లి పక్కన గీసిన బాక్స్‌లో పెట్టాలి. రెండు క్లాన్స్ నుంచి ఒక్కొక్కరు, లేదా ఇద్దరు, ముగ్గురు ఇలా రావాలని, అది తానే చెబుతానని బిగ్ బాస్ చెప్పాడు.
Bigg Boss 8 Telugu : అడ్డంగా బుక్ అయిన అవినాష్.. ఆయనని పంపించాల్సిందే అంటున్న గంగవ్వ
ఈ గేమ్ అటు ఇటు ఆడి చివరికి రాయల్ క్లాన్ గెలిచింది. బిగ్ బాస్ టీవీలో పృథ్వీ గడ్డం లేకుండా ఉన్న మూడు ఏఐ ఫోటోలను చూపించి వాటి కింద ఒకొక్క అమౌంట్ ఇస్తాడు. హెయిర్ కట్ చేయించుకుంటే రూ. 25వేలు, గడ్డం మాత్రం తీసెస్తే రూ.50 వేలు, గడ్డం-మీసం రెండూ తీసెస్తే రూ. లక్ష అని రాసి ఉంటుంది. అలాగే అవినాష్ ఫోటోలు కూడా పెడతాడు. అయితే అవినాష్ గడ్డం-మీసం తీసేసి హెయిర్ స్పైక్ కటింగ్ చేయించుకొని రూ.50వేలు గెలుచుకుంటాడు. ఇక నిఖిల్, నబీల్‌లో ఎవరిని తీసేద్దాం అంటే గంగవ్వ నిఖిల్ పేరు చెబుతుంది. నిఖిల్ గాన్ని తీసేయ్యాలే.. పెద్ద డేంజర్ గాడు వాడు.. అని గంగవ్వ అంది. దాంతో అంతా ఒక్కసారిగా నవ్వేశారు. తర్వాత ఇంకొకరి పేరు చెప్పమంటే తన టీమ్ మెంబర్ అయిన రోహిణి పేరు చెప్పింది గంగవ్వ. అయ్యో.. మనదాంట్లో కాదే.. అంటే అప్పుడు నబీల్ పేరు చెబుతుంది..
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
This website uses cookies.