
Gangavva : గంగవ్వ వారిద్దరి గాలి అలా తీసేసింది ఏంటి.. కొత్త మెగా చీఫ్ మరెవరో కాదు..!
Gangavva : బిగ్ బాస్ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన గంగవ్వ ఏ మాత్రం తగ్గడం లేదు. పంచ్‌లు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజా ఎపిసోడ్‌లో విష్ణు ప్రియా, పృథ్వీలకి పంచ్ వేయగా పక్కనే ఉన్న విష్ణుప్రియ కవర్ చేసే ప్రయత్నం చేసింది. మీ ఇద్దరూ అన్న చెల్లెళ్ళ తీరు ఉన్నారు అంటూ ఓ రేంజ్ లో ఆడుకుంది గంగవ్వ. ఇక కంటెండర్‌షిప్ కాపాడుకోవడం కోసం పృథ్వీకి కీని పట్టు కంటెండర్‌షిప్ పట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో తనతో పోటీపడే కంటెస్టెంట్‌ను ఎంచుకునే అవకాశం పృథ్వీకే ఇచ్చాడు బిగ్‌బాస్. పృథ్వీ తెలివిగా విష్ణుప్రియను పోటీదారుగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ టాస్క్‌కు యష్మీ సంచాలక్‌గా వ్యవహరించారు.
ఈ గేమ్ మొదలవగానే విష్ణు చకచకా మొదటి కీ ఓపెన్ చేసింది. కానీ రెండో కీ సమయంలో పృథ్వీ స్ట్రాటజీ ప్లే చేసి విష్ణుని బోల్తా కొట్టించాడు. చివరకు పృథ్వీ విన్ అయ్యాడు. దాంతో అతను మూడో చీఫ్ కంటెండర్ అయ్యాడు. అలాగే బ్రీఫ్‌కేసు ఇచ్చాడు బిగ్ బాస్. అందులో రూ. 99 వేలు ఉన్నాయి. అలాగే తనకి వచ్చిన ఆరెంజ్ బ్రీఫ్‌కేసున విష్ణుప్రియకే ఇచ్చేశాడు పృథ్వీ. ఆతర్వాత విష్ణుని పృథ్వీ ఎలా బోల్తా కొట్టించాడో చెప్పారు తేజ, రోహిణి, హరితేజ. దానికి అందులో తప్పేముంది అంటూ కవర్ చేసింది విష్ణు. ఆతర్వాత తేజ, రోహిణి మనమధ్య పుల్లలు పెడుతున్నారు అంటూ విష్ణు వచ్చి పృథ్వీకి చెప్పేసింది. పృథ్వీ విష్ణు ప్రియపై ప్రశంసలు కురిపించడంతో విష్ణు ప్రియా గాలిలో తేలిపోయింది. యష్మీ-విష్ణుప్రియ-ప్రేరణ ముగ్గురికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
Gangavva : గంగవ్వ వారిద్దరి గాలి అలా తీసేసింది ఏంటి.. కొత్త మెగా చీఫ్ మరెవరో కాదు..!
ఈ టాస్క్ లో కొన్ని బ్యాగులు ఇచ్చి.. ఆబ్యాగులను అడ్డంకులు దాటుకొని టేబుల్‌పై విసరాలి అని చెప్పాడు బిగ్ బాస్. బజార్ మోగేలోగా ఎవరు ఎక్కువ బ్యాగులు విసురుతారో వారే విన్నర్ అని చెప్పాడు. ఈ టాస్క్ లో ప్రేరణ విన్ అయ్యింది. విన్ అయిన ప్రేరణ సూట్ కేస్ ఇచ్చాడు బిగ్ బాస్ అందులో రూ.2 లక్షల 12 వేల రూపాయలు ఉన్నాయి. విష్ణుప్రియ-పృథ్వీ-హరితేజ గంగవ్వ దగ్గర డిస్కషన్ పెట్టారు. ఈ ఇంట్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటూ విష్ణు అడిగితే పృథ్వీ అని చెప్పింది గంగవ్వ. మరి నేను ఇష్టం లేదా అంటూ విష్ణు అడిగితే నువ్వు కూడా ఇష్టమే..అని అమాయకంగా అంది గంగవ్వ. తల్లి లేని పిల్ల కదా మనం అన్నీ చేయాలి అంటూ గంగవ్వ అంటుంటే పృథ్వీ అందుకే అవ్వ నేను గెలిచినా సూట్ కేసును విష్ణుకి ఇచ్చాను అని అన్నాడు దానికి గంగవ్వ అదిరిపోయే పంచ్ వేసింది. అవును.. మరి నీకు అన్నం తినిపిస్తాంది.. అన్నీ చేస్తాంది.. ఓ చెల్లి తీరుగా అంటూ గంగవవ్వ అంది. దాంతో విష్ణు ప్రియా, పృథ్వీ లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. హరితేజ అయితే తెగ నవ్వుకుంది.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.