Gangotri Movie Child Artist : “గంగోత్రి”లో చిన్న పాప చూడండి ఎంత పెద్దది అయిపోయిందో వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 16 March 2023, 6:40 pm

Gangotri Movie Child Artist : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొట్టమొదటి సినిమా గంగోత్రి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఫస్ట్ సినిమాతో బన్నీ పర్వాలేదనిపించారు. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించిన సంగతి తెలిసిందే. వల్లంకి పిట్ట అనే పాటలో కనిపిస్తది. సినిమాలో చాలా కీలకంగా హీరోయిన్ చిన్ననాటి పాత్రలో కనువిందు చేయడం జరిగింది. ఒక్క “గంగోత్రి” లో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ శ్రేయ కలిసి నటించిన “బాలు” సినిమాలో కూడా…

Gangotri Movie Child Artist Kavya Kalyanram Superb Looks At Balagam Movie Success Meet

Gangotri Movie Child Artist Kavya Kalyanram Superb Looks At Balagam Movie Success Meet

కావ్య కళ్యాణ్ రామ్ చిన్ననాటి పాత్ర చేయడం జరిగింది. కాగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ “బలగం” సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మన్నలను పొందింది. వేణు దర్శకత్వంలో వచ్చిన “బలగం” సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా సక్సెస్ వేడుక ఇటీవల… కరీంనగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ తో పాటు తెలంగాణ మంత్రులు కూడా హాజరయ్యారు.

Gangotri Movie Child Artist Kavya Kalyanram | Kavya Kalyanram Real Life | SumanTV - YouTube

ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాకీ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో… “బలగం” మూవీ యూనిట్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. అప్పటి గంగోత్రి మరియు బాలు సినిమాలో చిన్ననాటి పాత్రలో కనిపించిన కావ్య కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోయిన్ గా… చాలా పెద్దది కావటంతో.. తెలుగు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

Also read

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp