Junior NTR – Ram Charan : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి మధ్యనా గొడవ పెట్టింది వాడే ?

 Authored By prabhas | The Telugu News | Updated on :15 April 2023,12:00 pm

Junior NTR – Ram Charan : ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య గ్యాప్ వచ్చిందని న్యూస్ వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలో చరణ్, తారక్ చాలా క్లోజ్ గా ఉన్నారు. పలు ఇంటర్వ్యూలలో ఒకరి గురించి మరొక పొగడడం వంటి సన్నివేశాలు ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ని మరింత దగ్గర చేశాయి. ఇదంతా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కి ముందు మాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అందుకు కారణం రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ రావటం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Gap between Junior NTR and Ram Charan

Gap between Junior NTR and Ram Charan

ఈ కారణంగానే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. అందుకు కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. దంకీ సినిమా ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకి పనిచేసిన అందరి పేర్లు గుర్తు చేసుకున్నారు. కానీ చరణ్ పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే అంతకుముందు ఎన్టీఆర్ ఓ ట్వీట్లో చరణ్ గురించి ప్రస్తావించలేదు. ఆస్కార్ అవార్డు వేడుకలో భాగంగా ఇద్దరు కలిసి అమెరికా ప్రయాణం కలిసి చేయలేదు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ఎన్టీఆర్ ఎక్కడా కనిపించలేదు. అలాగే తారక్ ఇటీవల ప్రవేట్ పార్టీని ఏర్పాటు చేశారు. అందులో దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.

ram charan chief guest in junior ntr evaru meelo koteeswarulu

ram charan chief guest in junior ntr evaru meelo koteeswarulu

అలాగే విదేశీ సాంకేతిక నిపుణులు, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ సైతం పాల్గొన్నారు. కానీ రామ్ చరణ్ ఎక్కడ కనిపించలేదు. ఈ సన్నివేశాలు బట్టి చూస్తే రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మధ్య నిజంగా గ్యాప్ వచ్చిందని అర్థమవుతుంది. గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ ఇద్దరిలో ఒకరికి మాత్రమే సొంతం అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తక్కువ చూపించారని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చరణ్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చిందని అనుకుంటున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి