Allu Arjun: స్మగ్లర్‌గా చేసిన అల్లు అర్జున్ హీరోనా.. కడిగిపారేస్తానంటూ గరికపాటి ఫైర్
Allu Arjun: ప్రముఖ ఆధ్యాత్మక వేత్త, అవధాని గరికపాటి నరసింహారావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సాహిత్యం విభాగం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన గరికపాటి నరసింహారావు తనదైన స్టైల్ లో ప్రవచనాలు ఇస్తూ నేటి కాల పరిస్ధితుల గురించి ఉన్నది ఉన్నట్లు క్లీయర్ గా మొహానే చెప్పేస్తుంటారు. అతను తరచుగా చిటికెడు వ్యంగ్యం కామెడీతో నిజ జీవిత ఉదాహరణలను జతచేస్తాడు. తాజాగా ఆయన పుష్ప సినిమాని ఉదాహరణగా తీసుకొని అల్లు అర్జున్, సుకుమార్‌ని కడిగిపారేస్తానంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం గరికపాటి వ్యాఖ్యలు సెన్సేషన్‌గా మారాయి.
పిల్లల మనస్తత్వాలు, వారి ఎదుగుదల గురించి ప్రవచనం చేస్తున్న గరికపాటి.. రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్పపై విమర్శలు కురిపించారు. రీసెంట్ గా వచ్చిన పుష్ఫ సినిమాలో స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా చూపించారని అన్నారు. చివరిలో 5 నిమిషాలు మంచిగా చూపిస్తామని..పుష్ప 2 లో చూపిస్తామని చెబుతున్నారని అప్పటి వరకూ సమాజం చెడిపోదా అంటూ మండిపడ్డార పుష్ఫ సినిమా హీరో గానీ డైరెక్టర్ గానీ దీనిపై తనకు సమాధానం చెప్పాలని గరికపాటి నిలదీశారు. ఇంకా తగ్గేదే లే అంటూ స్మగ్లర్లకు డైలాగులు ఏంటని ప్రశ్నించారు.
తగ్గేదే లే ఎవడు అనాలి..
మంచి తనం ఉన్న హీరోను చూపించిన సినిమా ఒక్కటైనా వస్తుందా….వస్తే ఆడుతుందా ఆడకపోతే వదిలేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి దండ్రులు పిల్లల మార్కులు చూసి వాడిని హీరోను చేయొద్దని గరికపాటి అన్నారు. అలా చేస్తే వాడు చివరికి జీరో అవతాడంటూ వ్యాఖ్యానించారు. తగ్గేదే లే అని ఎవరు అనాలి? హరిశ్చంద్రుడు లాంటి వాడు అనాలి, శ్రీరామ చంద్రుడు లాంటి వాడు వాడాలి.. ఒక స్మగ్లర్ వాడటం ఏంటండి ఆ డైలాగ్? ఇవీ జరుగుతున్న అన్యాయాలు. ఏది సంచలనం చేయాలో అది చేయడం మానేసి.. దుర్మార్గాన్ని సంచలనం చేస్తున్నాం. దొంగతనాన్ని సంచలనం చేస్తున్నాం.. ఒకడు హీరోయిన్‌ని ప్రేమిస్తాడు.. ఆమె కోసం రూ. 20 వేల విలువైన నగలు దొంగతనం చేస్తాడు. అది చూపిస్తాడు.. వాడిని హీరోగా చూపిస్తాడు! అక్కడి నుంచి సమాజంలో అమ్మాయిల కోసం దొంగతనాలు మొదలవుతాయి అంటూ గరికపాటి కీలక వ్యాఖ్యలు చేశాడు.