Home » Entertainment » Garikapati Warning To Chiranjeevi
Entertainment

Chiranjeevi : చిరంజీవి నువ్వు ఆ ఫోటోలు దిగడం ఆపేయ్.. గరికపాటికి కోపం తెప్పించిన మెగాస్టార్..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: October 6, 2022, 7:30 pm
Advertisement

Chiranjeevi : బీజేపీ నేత దత్తాత్రేయ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే అలయ్ బలయ్ ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరుగుతుంది. పార్టీలు.. పదవులు అనే తేడా లేకుండా అందరు అలయ్ బలయ్ అనుకుని తేనీటి విందు పుచ్చుకుంటారు. ఎన్నో ఏళ్లుగా దత్తాత్రేయ ఎ ప్రోగ్రాం ని చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఈ ప్రోగ్రాం కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ అటెండ్ అయిన ఈ ప్రోగ్రాం కి ఈసారి మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. చిరు వచ్చారంటే అక్కడ సందడి మొదలైనట్టే.

Advertisement

అయితే ఇదే ప్రోగ్రాం కి అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి నరసింహా రావు కూడా అటెండ్ అయ్యారు. ఆయన చెప్పే ఉపన్యాసాలకు ఎవరైనా డిస్ట్రబ్ చేస్తున్నారు అంటే అది ఎంతటి వారినైనా సరే నిలదీసే మనస్థత్వం ఆయనది. అలయ్ బలయ్ కార్యమ్రమంలో కూడా ఓ పక్క గరికపాటి గారు తన ఉపన్యాసం మొదలు పెట్టగా మరోపక్క వేడుకలో పాల్గొన్న చిరంజీవితో ఫోటో సెషన్ మొదలు పెట్టారు అక్కడ ప్రజలు. అయితే ఒక నిమిషం చూసిన గరికపాటి వారు కోపగించుకుని చిరంజీవి గారు ఆ ఫోటో సెషన్ ఆపేస్తే కానీ నేను నా ప్రసంగాన్ని మొదలు పెడతా లేదంటే నా దారిన నేను వెళ్తానని అన్నారు.చిరంజీవి కనిపించగానే ఒక ఫోటో తీసుకోవాలని అందరికి ఉంటుంది.

garikapati warning to chiranjeevi

Advertisement

అది తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే చిరంజీవి వారికి సెల్ఫీస్ ఇవ్వాలి. ఇదే విషయం గరికపాటి గారికి ఆవేశం తెప్పించింది. ఆయన చిరంజీవి గారు ఫోటో సెషన్ ఆపేయండి అనగానే కార్యక్రమం నిర్వహిస్తున్న సభ్యులు ఆయనకు సర్ధిచెప్పారు. ఆ తర్వాత గరికపాటి గారు కూడా చిరంజీవి గురించి గొప్పగా చెప్పారు. చిరంజీవి కూడా గరికపాటి గారి గురించి తన మాటల్లో చెప్పారు. అలయ్ బలయ్ ప్రోగ్రాం వీరి కలయిక ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తన ప్రసంగాలతో ప్రజలకు జ్ఞానాన్ని పంచడంతో పాటుగా సాధ్యమైనంత వరకు మన వాడుక భాషలో ప్రసంగాన్ని చెప్పడంలో గరికపాటి గారిలో ఉన్న గొప్ప విశేషం. అంతేకాదు ఆయన చెప్పే విధానం కూడా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి