Batukamma : బతుకమ్మలకు బదులు గ్యాస్ సిలిండర్లు.. మహిళల వినూత్న నిరసన.. ఎక్కడంటే.. ? వీడియో

Batukamma : తెలంగాణ సమాజం జరుపుకునే అతిగొప్ప పండుగ బతుకమ్మ అన్న సంగతి అందరికీ విదితమే. ‘ఎంగిలపూల’ బతుకమ్మతో మొదలైన ప్రకృతిని పూజించే పండుగ మహిళలకు చాలా ఇష్టం. కాగా చెన్నూరు పట్టణంలోని చింతలగూడ కాలనీలో మహిళలు వినూత్నంగా బతుకమ్మ ఆడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ వారు బతకమ్మ పాట పాడుకున్నారు.

gas cylinders instead of bathukamma Video

‘సిలిండర్ ధరలు వెయ్యికి పెంచిన బీజేపీ.. పెట్రోల్, డీజిల్ పెంచిన బీజేపీ.. నిత్యావసర ధరలు పెంచిన బీజేపీ.. రాకాసీ బీజేపీ వలలో.. వద్దద్దు మనకొద్దు వలలో.. ప్రభుత్వ సంస్థలను వలలో.. ప్రైవేటు చేస్తున్న వలలో.. కార్పొరేటులకు దేశాన్ని అమ్మేయ జూస్తున్న వలలో.. ఉన్న ఉద్యోగాలు వలలో.. ఊడబీకుతున్న వలలో.. అబద్ధాలతోని ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ.. వద్దద్దు మనకద్దే బీజేపీ.. సోపతి మనకద్దే బీజేపీ..

gas cylinders instead of bathukamma Video

కేసీఆర్ సారు మనిషని ఈటలను…ఇన్నేళ్లు గెలిపిస్తే నమ్మి చేరదీస్తే నమ్మకద్రోహం చేసిండే వలలో..కోట్లకు పడగెత్తి ఈటల కుట్రలు చేస్తుండే వలలో’ అంటూ మహిళలు పాడుకున్నారు. పూలతో పేర్చిన బతకమ్మలకు బదులుగా సిలిండర్ గ్యాస్‌లో మధ్యలో పెట్టి మహిళలు బతుకమ్మ ఆడటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోను టీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది వైరలవుతోంది.

Recent Posts

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

7 minutes ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

1 hour ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

2 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

3 hours ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

4 hours ago

Rain Water : వర్షపు నీరు ఎప్పుడైనా తాగారా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…?

Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…

5 hours ago

Gk Fact Osk : కోడి కూడా ఈ దేశానికి జాతీయ పక్షి… మీకు తెలుసా…?

Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…

6 hours ago

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…

7 hours ago