Batukamma : బతుకమ్మలకు బదులు గ్యాస్ సిలిండర్లు.. మహిళల వినూత్న నిరసన.. ఎక్కడంటే.. ? వీడియో
Batukamma : తెలంగాణ సమాజం జరుపుకునే అతిగొప్ప పండుగ బతుకమ్మ అన్న సంగతి అందరికీ విదితమే. ‘ఎంగిలపూల’ బతుకమ్మతో మొదలైన ప్రకృతిని పూజించే పండుగ మహిళలకు చాలా ఇష్టం. కాగా చెన్నూరు పట్టణంలోని చింతలగూడ కాలనీలో మహిళలు వినూత్నంగా బతుకమ్మ ఆడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ వారు బతకమ్మ పాట పాడుకున్నారు.
‘సిలిండర్ ధరలు వెయ్యికి పెంచిన బీజేపీ.. పెట్రోల్, డీజిల్ పెంచిన బీజేపీ.. నిత్యావసర ధరలు పెంచిన బీజేపీ.. రాకాసీ బీజేపీ వలలో.. వద్దద్దు మనకొద్దు వలలో.. ప్రభుత్వ సంస్థలను వలలో.. ప్రైవేటు చేస్తున్న వలలో.. కార్పొరేటులకు దేశాన్ని అమ్మేయ జూస్తున్న వలలో.. ఉన్న ఉద్యోగాలు వలలో.. ఊడబీకుతున్న వలలో.. అబద్ధాలతోని ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ.. వద్దద్దు మనకద్దే బీజేపీ.. సోపతి మనకద్దే బీజేపీ..
కేసీఆర్ సారు మనిషని ఈటలను…ఇన్నేళ్లు గెలిపిస్తే నమ్మి చేరదీస్తే నమ్మకద్రోహం చేసిండే వలలో..కోట్లకు పడగెత్తి ఈటల కుట్రలు చేస్తుండే వలలో’ అంటూ మహిళలు పాడుకున్నారు. పూలతో పేర్చిన బతకమ్మలకు బదులుగా సిలిండర్ గ్యాస్‌లో మధ్యలో పెట్టి మహిళలు బతుకమ్మ ఆడటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోను టీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది వైరలవుతోంది.
బతుకమ్మలకు బదులు గ్యాస్ సిలిండర్లు పెట్టి బతుకమ్మ ఆడి మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. చెన్నూర్ పట్టణంలోని చింతలగూడ కాలనీలో బతుకమ్మ పండుగ ప్రారంభం కాగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బతుకమ్మలను బదులు గ్యాస్ సిలిండర్ లు పెట్టి మహిళలు బతుకమ్మ పాటలు పాడుకున్నారు. pic.twitter.com/1fRfZfejVh
— Balka Suman (@balkasumantrs) October 8, 2021