Jabardast : జబర్దస్త్‌ షో పై దృష్టి పెట్టిన జెమిని టీవీ.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 5, 2022, 3:30 pm

Jabardast : తెలుగు బుల్లితెర పై సెన్సేషన్ క్రియేట్ చేసిన జబర్దస్త్ కామెడీ షో పది సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా నెంబర్ వన్ కామెడీ షో గానే కొనసాగుతున్న విషయం తెలిసిందే. మల్లెమాల వారు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్తో అప్పట్లో మొదలు పెట్టారు. ఒక కామెడీ షో కు ఇంత బడ్జెట్ అవసరమా ఇంత భారీ తారాగణం అవసరమా అంటూ చాలా మంది ఆ సమయంలో పెదవి విరిచారు. కానీ అనూహ్యంగా జబర్దస్త్ కార్యక్రమం ఈ టీవీ ని టాప్ పొజిషన్ లో ఉంచడంలో కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ సూపర్ హిట్ అవ్వడంతో చాలా ఛానల్స్ ఆ కార్యక్రమాన్ని కాపీ కొట్టి ఎందుకు ప్రయత్నించాయి.

ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్‌ అయ్యాయి. స్టార్ మా మరియు జీ తెలుగు చానల్స్ చాలా గట్టిగానే జబర్దస్త్ కార్యక్రమాన్ని ఢీ కొట్టేందుకు ప్రయత్నాలు చేశాయి కానీ ఏ ఒక్కరికి కూడా అది సాధ్యం కాలేదు. స్టార్ మా ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. కానీ జీ తెలుగు మాత్రం చేతులెత్తేసి పక్కకు వెళ్లి తన దైన శైలి సీరియల్స్ మరియు ఇతర కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ముందుకు వెళుతుంది. జబర్దస్త్ కార్యక్రమాన్ని బీట్ చేయడం అనేది ఏ ఒక్కరి వల్ల కాదు అని పలు సందర్భాల్లో నిరూపితమైంది. ప్రస్తుతం స్టార్ మా లో వస్తున్న కామెడీ స్టార్ కార్యక్రమం తో కూడా క్లారిటీ వచ్చేసింది.ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎవరు ప్రయత్నించినా కూడా జబర్దస్త్ ఢీకొట్టడం కానీ..

gemini tv want to do jabardast like comedy show

gemini tv want to do jabardast like comedy show

ఆ షో యొక్క క్రేజ్‌ ను బీట్ చేయడం ఏ ఒక్కరికి లేదని అంటున్నారు. ఈ సమయం లో జెమినీ టీవీ వారు జబర్దస్త్ పై దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది. జబర్దస్త్ తరహా ఒక భారీ కామెడీ షో తీసుకు రావడం కోసం జెమినీ టీవీ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. డేటింగ్ పరంగా జెమిని టివీ గత కొన్ని సంవత్సరాలుగా 4వ స్థానం కు పడిపోయింది. ఆ చానల్ ని మళ్లీ నెంబర్ వన్ కు తీసుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో ప్రతి ఒక్కటి విఫలమవుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో భాగంగా కొత్తగా జబర్దస్త్ తరహా కామెడీ కార్యక్రమాన్ని జెమినీ టీవీ లో తీసుకు వచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని సన్ నెట్వర్క్ వారు భావిస్తున్నారట. జెమినీ టీవీలో జబర్దస్త్ తరహా కామెడీ షో ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp