Jabardasth Mahidhar | జ‌బ‌ర్ధ‌స్త్‌లో క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ‌.. ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన కమెడీయ‌న్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth Mahidhar | జ‌బ‌ర్ధ‌స్త్‌లో క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ‌.. ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన కమెడీయ‌న్

 Authored By sandeep | The Telugu News | Updated on :11 September 2025,2:00 pm

Jabardasth Mahidhar | జబర్దస్త్ కామెడీ షోలో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి టీమ్ లీడర్ గా ఎదిగాడు మహీధర్. కానీ తర్వాత జబర్దస్త్ పలు కారణాలతో మానేసాడు. తాజాగా జబర్దస్త్ మహీధర్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహీధర్ మాట్లాడుతూ.. నేను జబర్దస్త్ కోసమే హైదరాబాద్ కి వచ్చాను. చాలా కష్టాలు పడి జబర్దస్ లోకి ఎంటర్ అయ్యాను. కిరాక్ ఆర్పీ వెళ్ళాక నాకు టీమ్ లీడర్ వచ్చింది. కరోనాతో నా టీమ్ లీడర్ పోయింది. తర్వాత ఆర్టిస్ట్ గా కూడా కొన్ని స్కిట్స్ చేశాను.

#image_title

అలా చేశారు..

టీమ్ లీడర్ తీసేసిన తర్వాత చంటి అన్న టీమ్ లో ఆర్టిస్ట్ గా చేశారు. అక్కడ నాకు సరైన క్యారెక్టర్స్ ఇవ్వలేదు. గుంపులో గోవింద అన్నట్టు క్యారెక్టర్ ఇచ్చారు. నాకు అప్పటికే టీమ్ లీడర్ చేసిన అనుభవం కూడా ఉంది.నాకు అది నచ్చకపోవడంతో డైరెక్టర్స్ కి చెప్తే తాగుబోతు రమేష్ అన్న టీమ్ లో వేశారు. రమేష్ దాంట్లో వేస్తే రెండు స్కిట్స్ అవ్వగానే ఒక రోజు ప్రాక్టీస్ కి వెళ్తే నిన్ను తీసేసాం తెలీదా, నీకు చెప్పలేదా అన్నాడు.

నేను వెళ్లి డైరెక్షన్ టీమ్ ని అడిగితే నీకు చెప్పలేదు, నువ్వేమి పట్టించుకోవు, ఫీల్ అవ్వవు అని చెప్పలేదు అన్నారు. నాకు బాధేసి వెళ్ళిపోయాను. అప్పుడు జబర్దస్త్ అది నా ప్లేస్ కాదు అనిపించింది. అంతమంది ముందు మొహం మీదే నిన్ను తీసేసాం అంటే ఎలా ఉంటుంది. కనీసం ముందే చెప్తే ఆ షెడ్యూల్ కి వెళ్ళేవాడిని కాదు. ఓ విషయంలో నాకు అసిస్టెంట్ డైరెక్టర్ కి గొడవ అయింది. అతను క్యాస్ట్ ఫీలింగ్ తో ఇంకో ఆర్టిస్ట్ ని సపోర్ట్ చేసాడు. అతనితో రోడ్ మీద గొడవ పడ్డాను. టీమ్ లీడర్ గా నన్ను అసలు పట్టించుకోలేదు అందుకే ఇవన్నీ ఆలోచించుకొని నేను జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాను. ప్రస్తుతం వైజాగ్ లోనే ఉంటూ యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నాడు మహీధర్

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది