Home » Entertainment » Getting Oscar Award For Trivikram Movie
Entertainment

Trivikram : బిగ్ న్యూస్… త్రివిక్రమ్ సినిమా కి ఆస్కార్ అవార్డ్ ??

Authored By
aruna
The Telugu News | Published on: January 28, 2023, 7:20 pm
Advertisement

Trivikram : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. తారక్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు నాటునాటు పాటతో ఆస్కార్ రేసులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమా పోటీ పడుతుంది. ఇప్పటికే నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ క్రమంలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అవ్వడంతో మరోసారి దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Getting Oscar award For Trivikram Movie?

దీంతో రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాకి ప్లస్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేసేలా రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ సినిమా ఈవెంట్ ప్రమోషన్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని జర్నలిస్ట్ ఓ ప్రశ్న అడిగాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ కి వెళ్ళాడు కదా మీరెప్పుడు మీ సాంగ్స్ తో ఆస్కార్ కి వెళతారని అని అడిగారు. దానికి బదులుగా తమన్ త్రివిక్రమ్ తనని ఆస్కార్ కి తీసుకొని వెళ్తారని చెప్పాడు.

Advertisement

Getting Oscar award For Trivikram Movie?

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాను దృష్టిలో పెట్టుకొని తమన్ ఆ వ్యాఖ్యలు చేశాడని తెలుస్తుంది.ఇప్పటికే త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అంతకు మించిన ఆల్బమ్ ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాకి అందించబోతున్నట్లు తమన్ మాటలబట్టి తెలుస్తుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి