
getup srinu and mallemala getting trolls for 10 getups in single show
Getup Srinu : ఉపయోగపడుతున్నాయి కదా అని వస్తువులను లేదా మరేదైనా పద్ధతిని పదే పదే ఉపయోగిస్తే కొన్నాళ్లకు నష్టం తప్పదు, అవసరం ఉన్నా లేకున్నా ఉపయోగిస్తే అవసరం ఉన్న సమయంలో ఉపయోగించడానికి వస్తువు ఉండదు. ఏదైనా అతి అనేది మంచిది కాదు. ఈ విషయం ఈటీవీ మల్లెమాల వారు గుర్తిస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఈటీవీ మల్లెమాల వారు గెటప్ శ్రీను ని ఏ స్థాయిలో వినియోగించుకుంటున్నారో తెలిసిందే. గెటప్ శ్రీను యొక్క క్రేజ్ ని ఉపయోగించుకోవడం కోసం ప్రతి స్కిట్.. ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక గెటప్ ఆయనతో వేయిస్తూనే ఉన్నారు.
ఈ మధ్య కాలంలో గెటప్ శ్రీనుని ఒరిజినల్ గా చూసిందే లేదు, ఆయన ఎప్పుడు చూసినా గెటప్ లోనే కనిపిస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఒకింత మొహం మొట్టినట్లుగా చూస్తున్నారు. త్వరలో రాబోతున్న దసరా ఈవెంట్ ఎపిసోడ్ లో ఏకంగా 10 గెటప్స్ ని బుల్లి తెర కమల్ హాసన్ గెటప్ శ్రీను తో మల్లెమాల వారు వేయించారు. దశావతారం సినిమాలో కమల్ హాసన్ 10 పాత్రలు వేస్తేనే బాబోయ్ ఇన్ని పాత్రలు అవసరమా అంటూ కొందరు పెదవి విరిచారు. అలాంటిది ఒక బుల్లి తెర కార్యక్రమం కోసం పది గెటప్స్ వేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు బాహాటంగానే మల్లెమాల వారిని మరియు గెటప్ శ్రీను ని ప్రశ్నిస్తున్నారు.
getup srinu and mallemala getting trolls for 10 getups in single show
వాళ్లకు ఎలాగూ బుద్ధి లేదు కనీసం మీరైనా ఆలోచించాలి కదా అంటూ కొందరు శ్రీను ని ప్రశ్నిస్తుంటే.. మరి కొందరు మాత్రం ఆయన తీరు ని అభినందిస్తున్నారు. 10 గెటప్స్ లో ఒకే సారి కనిపించడం అంటే కేవలం కమల్ హాసన్ కి మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు అది గెటప్ శ్రీను కి సాధ్యమైందంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుల్లి తెర కమల్ హాసన్ అని పేరు పెట్టుకున్నందుకు గెటప్ శ్రీను అద్భుతమైన నటనతో ప్రతి గెటప్ లో కూడా మైమరిపిస్తున్నాడు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం కొందరు మాత్రం ఓవరాక్షన్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎపిసోడ్ ప్రసారమైతే గెటప్ శ్రీను పై విమర్శలు వస్తాయా ప్రశంసలు దక్కుతాయా అనేది చూడాలి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.