Getup Srinu : జబర్దస్త్ ద్వారా గుర్తింపు దక్కించుకున్న కమెడియన్స్ ఎంతో మంది. కొందరు నార్మల్ కమెడియన్స్ గా సినిమాల్లో మరియు బుల్లి తెరపై సందడి చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం స్టార్స్ అయ్యారు. అందులో సుడిగాలి సుధీర్.. హైపర్ ఆది మరియు గెటప్ శ్రీను లు ఉన్నారు. ఈ ముగ్గురిలో సుడిగాలి సుధీర్ ఇప్పటికే జబర్దస్త్ మానేసి సినిమాలతో బిజీగా ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇక గెటప్ శ్రీను చాలా రోజులుగానే సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో గెటప్ శ్రీనుకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.
గెటప్ శ్రీను ఆ మధ్య జబర్దస్త్ కు కొన్ని నెలల పాటు బ్రేక్ తీసుకున్నాడు. ఎట్టకేలకు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో రామ్ ప్రసాద్ తో కలిసి గెటప్ శ్రీను టీమ్ నడిచింది. బయట సినిమాల్లో నటిస్తే వచ్చే పారితోషికంతో పోల్చితే జబర్దస్త్ కు మల్లెమాల వారు ఇచ్చే పారితోషికం చాలా తక్కువ. అయినా కూడా కొన్నాళ్లు చేయాలని భావించిన గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ గెటప్ శ్రీను కాస్త పెంచమంటూ పారితోషికం విషయంలో డిమాండ్ చేయగా మల్లెమాల వారు నిరాకరించారు అంటూ సమాచారం అందుతోంది.
భారీ పారితోషికం ఇవ్వడం మా వల్ల కాదు అంటూ మల్లెమాల వారు గౌరవంగానే గెటప్ శ్రీనును పంపించారు అంటున్నారు. ముందు ముందు శ్రీదేవి డ్రామా కంపెనీ లేదా ఇతర షోలకు తప్పకుండా హాజరు అయ్యేందుకు గెటప్ శ్రీను ఓకే చెప్పాడని.. మల్లెమాల వారు నిర్వహించే ప్రత్యేక షో లకు కూడా గెటప్ శ్రీను హాజరు అయ్యేందుకు ఓకే చెప్పాడట. రీ ఎంట్రీ ఇచ్చిన వెంటనే బయటకు వెళ్లి పోవడానికి కారణం కేవలం పారితోషికం ఇష్యూ అంటూ జబర్దస్త్ మరియు మల్లెమాల వర్గాల వారు చెబుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.