Home » Entertainment » Hero Adivi Sesh Comments About Star Heroes
Entertainment

Adivi Sesh : అతిపెద్ద వివాదం లో అడివి శేష్..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 9, 2023, 7:40 pm
Advertisement

Adivi Sesh : సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా క్షణాల్లో జనాల్లోకి వస్తుంది. దీంతో ఆ న్యూస్ ను ఇంకా వైరల్ అవుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇక సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి సక్సెస్ అందుకున్న హీరోలు స్టార్ హీరోల గురించి ఏదైనా మాట్లాడుతు వ్యాఖ్యలు చేశారంటే ఇండస్ట్రీలో అదే హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు యంగ్ హీరో అడవి శేషు. ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ హీరో అడవి శేషుకి మంచి సక్సెస్ రేటు ఉందని చెప్పవచ్చు.

Advertisement

ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆదరిస్తారో తెలుసుకుని అలాంటి సినిమాలను జనాలలోకి తీసుకెళ్లి మంచి సక్సెస్ అందుకుంటున్నాడు. క్షణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అడవి శేష్ ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత గూఢచారి, ఎవరు, హిట్ 2 సినిమాలు చేసి మంచి సక్సెస్ను అందుకున్నాడు. సొంత టాలెంట్ తో వచ్చిన అడివి శేషుకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. తన పని తాను చేసుకుని వివాదాలకు దూరంగా ఉంటాడని అందరూ అనుకున్నారు కానీ ఇటీవల అడవి శేషు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి.

hero Adivi sesh comments about star heroes

Advertisement

ప్రస్తుతం తన సినిమాలకు తానే కథ రాసుకోవడం వలన సక్సెస్ను అందుకుంటున్నానని అని చెప్పుకున్నాడు శేషు, సినిమా స్టోరీలు ఎందుకు రెడీ చేసుకుంటున్నారో దానికి క్లారిటీ ఇచ్చాడు. తెలుగులో ఒక్కో ఫ్యామిలీకి పది మంది హీరోలు ఉన్నారు. వారందరినీ దాటుకొని బ్యాక్ గ్రౌండ్ లేని వారి దగ్గరకు మంచి కథలు రావాలంటే చాలా కష్టం. అందుకే తన కథలను తానే రాసుకొని హిట్ ను అందుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. సొంత టాలెంట్ గురించి చెప్పుకుంటే తప్పులేదు కానీ స్టార్ హీరోల ఫ్యామిలీ పై కామెంట్ చేయడం సరికాదని అంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి