Getup Srinu : గెటప్ శ్రీనును భరించలేక పోయిన మల్లెమాల.. రీ ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఔట్‌…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Getup Srinu : గెటప్ శ్రీనును భరించలేక పోయిన మల్లెమాల.. రీ ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఔట్‌…!!

Getup Srinu : జబర్దస్త్‌ ద్వారా గుర్తింపు దక్కించుకున్న కమెడియన్స్ ఎంతో మంది. కొందరు నార్మల్‌ కమెడియన్స్ గా సినిమాల్లో మరియు బుల్లి తెరపై సందడి చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం స్టార్స్ అయ్యారు. అందులో సుడిగాలి సుధీర్‌.. హైపర్ ఆది మరియు గెటప్ శ్రీను లు ఉన్నారు. ఈ ముగ్గురిలో సుడిగాలి సుధీర్ ఇప్పటికే జబర్దస్త్‌ మానేసి సినిమాలతో బిజీగా ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇక గెటప్ శ్రీను చాలా రోజులుగానే సినిమాల్లో బిజీ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 January 2023,8:20 pm

Getup Srinu : జబర్దస్త్‌ ద్వారా గుర్తింపు దక్కించుకున్న కమెడియన్స్ ఎంతో మంది. కొందరు నార్మల్‌ కమెడియన్స్ గా సినిమాల్లో మరియు బుల్లి తెరపై సందడి చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం స్టార్స్ అయ్యారు. అందులో సుడిగాలి సుధీర్‌.. హైపర్ ఆది మరియు గెటప్ శ్రీను లు ఉన్నారు. ఈ ముగ్గురిలో సుడిగాలి సుధీర్ ఇప్పటికే జబర్దస్త్‌ మానేసి సినిమాలతో బిజీగా ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇక గెటప్ శ్రీను చాలా రోజులుగానే సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. స్టార్‌ హీరోల సినిమాల్లో గెటప్ శ్రీనుకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

గెటప్ శ్రీను ఆ మధ్య జబర్దస్త్‌ కు కొన్ని నెలల పాటు బ్రేక్ తీసుకున్నాడు. ఎట్టకేలకు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో రామ్‌ ప్రసాద్‌ తో కలిసి గెటప్ శ్రీను టీమ్ నడిచింది. బయట సినిమాల్లో నటిస్తే వచ్చే పారితోషికంతో పోల్చితే జబర్దస్త్‌ కు మల్లెమాల వారు ఇచ్చే పారితోషికం చాలా తక్కువ. అయినా కూడా కొన్నాళ్లు చేయాలని భావించిన గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ గెటప్ శ్రీను కాస్త పెంచమంటూ పారితోషికం విషయంలో డిమాండ్ చేయగా మల్లెమాల వారు నిరాకరించారు అంటూ సమాచారం అందుతోంది.

Getup Srinu out from jabardasth due to remuneration issue

Getup Srinu out from jabardasth due to remuneration issue

భారీ పారితోషికం ఇవ్వడం మా వల్ల కాదు అంటూ మల్లెమాల వారు గౌరవంగానే గెటప్ శ్రీనును పంపించారు అంటున్నారు. ముందు ముందు శ్రీదేవి డ్రామా కంపెనీ లేదా ఇతర షోలకు తప్పకుండా హాజరు అయ్యేందుకు గెటప్ శ్రీను ఓకే చెప్పాడని.. మల్లెమాల వారు నిర్వహించే ప్రత్యేక షో లకు కూడా గెటప్ శ్రీను హాజరు అయ్యేందుకు ఓకే చెప్పాడట. రీ ఎంట్రీ ఇచ్చిన వెంటనే బయటకు వెళ్లి పోవడానికి కారణం కేవలం పారితోషికం ఇష్యూ అంటూ జబర్దస్త్‌ మరియు మల్లెమాల వర్గాల వారు చెబుతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది