BalaKrishna : మాది జ‌న్మ‌జ‌న్మ‌ల క‌ల‌యిక‌.. ఆ దేవుడే మ‌మ్మ‌ల్ని క‌లిపాడంటూ బాల‌కృష్ణ కామెంట్స్

BalaKrishna : ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించిన బాల‌య్య అదే జోష్‌తో అన్‌స్టాప‌బుల్ టాక్ షో చేస్తున్నాడు. ‘సింహా’ ‘లెజెండ్’ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ”అఖండ”. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ లోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్ లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్‌లో స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్నారు.

చిత్రం వీక్షించిన త‌ర్వాత బాల‌కృష్ణ మాట్లాడుతూ.. ”ఆర్.టి.సి. క్రాస్ రోడ్ కు వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. స్టూడియోలో నాన్నగారి కోసం టిఫిన్ తీసుకు వచ్చేవాడినంటూ అప్పటి రోజులను ప్రేక్షకులకు తెలియజేశారు. ”శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తు చేసుంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు.

God Himself touched us On Balakrishna comments

BalaKrishna : చిత్ర ఆద‌ర‌ణ‌పై బాల‌య్య సంతోషం..

”ఈ సినిమా విజయాన్ని చేసేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఇక బోయపాటి శ్రీను నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. అందుకే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు. మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈ అఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయంస‌స అని బాల‌కృష్ణ అన్నారు.

Recent Posts

LOBO | బిగ్ బాస్ ఫేమ్ లోబోకి ఏడాది జైలు శిక్ష‌.. ఏం త‌ప్పు చేశాడంటే..!

LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…

19 minutes ago

Sleep | రాత్రి పూట హాయిగా నిద్ర పోవాలి అంటే ఇవి తింటే చాలు..

Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…

1 hour ago

Clove Side Effects | లవంగం వినియోగం ..మితంగా తీసుకుంటే ఔషధం, అధికంగా తీసుకుంటే హానికరం!

Clove Side Effects | లవంగం అనేది మన ఇండియన్ కిచెన్‌లో తప్పనిసరి సుగంధ ద్రవ్యం. వండిన ఆహారానికి రుచి,…

2 hours ago

Health Tips | పాలు, పెరుగు విషయంలో జాగ్రత్తలు అవసరం.. ఖాళీ కడుపుతో తీసుకుంటే ప్రమాదమేనా?

Health Tips | పాలు, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలుగా ఎంతో మందికి తెలిసిందే. అయితే…

3 hours ago

Health Tips | పిస్తా ప‌ప్పుని రోజూ తినొచ్చా.. అవి తిన‌డం వల‌న ఎలాంటి ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా?

Health Tips | పిస్తా పప్పులు కేవలం రుచికరమైన వంటకాలలో చేర్చే ఒక సాధారణ పదార్థమే కాదు… ఇవి మన…

4 hours ago

Health Tips | గుడ్డు తినడంపై మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు.. ఏది మంచిది?

Health Tips | మన భారతీయ ఆహార వ్యవస్థలో గుడ్డు అనేది ముఖ్యమైన పోషకాహారంగా మారింది. అయితే గుడ్డులోని తెల్లసొన మాత్రమే…

5 hours ago

Lord Ganesha | వినాయకుడి వాహనాల వెనక ఆసక్తికర పురాణ కథలు.. ప్రతి యుగంలో ఓ ప్రత్యేక రూపం

Lord Ganesha | హిందూ సంస్కృతిలో విఘ్నేశ్వరుడు అంటే అనుదినం ప్రతి కార్యానికి ఆరంభంలో పూజించే దేవుడు. వినాయక చవితి…

6 hours ago

KTR – Bandi Sanjay : సిరిసిల్లలో ఎదురుపడ్డ బండి సంజయ్, కేటీఆర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే !!

KTR - Bandi Sanjay : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో…

15 hours ago