Godse First Day Collections : సందేశాత్మక కథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన గాడ్సే సినిమాను నిన్న (జూన్ 17) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగు తెరపై విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఆయన హీరోగా గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కించిన చిత్రం ‘గాడ్సే’. సీకే స్క్రిన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. సునీల్ కశ్యప్ బాణీలు కట్టారు.భారతదేశంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఓ సామాన్య యువకుడు చేసే పోరాటం నేపథ్యంతో ఈ గాడ్సే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా లోని సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా రూపొందించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించడంతో సినిమాపై హైప్ నెలకొంది.
అయితే ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు పాజిటివ్‌గానే స్పందించారు. సినిమా మొదటి భాగం మొదలు పెడుతూనే పోలీసులు రిస్కీ ఆపరేషన్ తో ప్రారంభించారు. ఒక్కొక్కరిని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేయడంతో అసలు ఎందుకు చేస్తున్నారు? అనే ఉత్సుకత పెంచారు. సినిమా ప్రారంభమైన చాలా సేపటి వరకు సత్యదేవ్ కనిపించడు. కొంచెం సత్యదేవ్ ఎంట్రీ ఇచ్చాక సినిమాలో స్పీడ్ పెరుగుతుంది. ఆ తరువాత కూడా అసలు కిడ్నాపులు ఎందుకు చేస్తున్నాడు? అసలు అతని మోటివ్ ఏంటి? అనే ఆసక్తి పెరుగుతుంది. అంతేకాక తనతో బేరసారాలు ఆడడానికి వచ్చిన ఒక లేడీ ఆఫీసర్ తో అసభ్యంగా మాట్లాడి కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఏమో అని అనుమానం కూడా కలిగిస్తాడు.
ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే మొదటి భాగం ముగిస్తారు. ఈ సినిమా కొంత పాజిటివ్ బజ్ అందుకుంది. విరాట పర్వం పోటీ మధ్య గాడ్సే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది, రెండు సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి మరియు గాడ్సే చిత్రం మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ సాధించింది, అయితే సత్యదేవ్ గత చిత్రం తిమ్మరుసు 0.57 కోట్లు వసూలు చేయగా . అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 1.34 కోట్లు వసూలు చేసింది మరియు సత్యదేవ్‌కి ఇది చాలా మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు మరియు సినిమా బ్రేక్ ఈవెన్‌కి చాలా వసూళ్ళని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాగా వసూల్ చేయాలనీ ఆశిద్దాం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.