Virata Parvam Movie : వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’ . 1990ల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు వేణుఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నక్సలిజం బ్యాక్డ్రాప్‌తో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమిది. ఇందులో దళ నాయకుడు రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటించగా.. ఆయన రచనలతో ప్రేరణ పొంది ఆయన్ని ప్రేమించి దళంలో చేరటానికి వెళ్లి.. రవన్నను కలిసే ప్రేమిక పాత్రలో సాయి పల్లవి నటించింది. రానా – సాయి పల్లవి వంటి క్రేజీ కాంబినేషన్‌తో తెరెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున రూ.14 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. రూ. 14.50 కోట్ల రాబట్టుకుంటేనే బ్రేక్ ఈవెన్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ‘విరాట పర్వం’ తొలిరోజున సాధించిన వసూళ్లు ఎంత అని కామన్ ఆడియెన్స్‌లో ఆసక్తి నెలకొంది. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.5 కోట్ల మేరకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో కలెక్షన్స్‌ను రాబట్టుకుంది. ఓవర్‌సీస్‌లో 245 లొకేషన్స్‌లో విడుదలైన ఈ సినిమా 60K డాలర్స్‌ను రాబట్టుకుంది. మరి కీలకమైన శని.. ఆది వారాల్లో ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాలి.
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమా, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుధాకర్ చెరుకూరి, రానా దగ్గుబాటి, శ్రీకాంత్ చేగొండి ‘విరాట పర్వం’ చిత్రాన్ని నిర్మించారు. సినిమా కోసం దాదాపు పదిహేను కోట్ల మేరకు బడ్జెట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర రానా దగ్గుబాటి సాయి పల్లవి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఏకంగా 1100 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఏ సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీనే ఓవరాల్ గా సొంతం చేసుకుంది కానీ సింగిల్ స్క్రీన్స్ అండ్ మాస్ సెంటర్స్ లో మాత్రం ఓపెనింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.