Dancer Janu : బంగారం లాంటి ఛాన్స్‌ను భలే వదిలేసుకుంది.. ఆమె స్టేట్‌మెంట్‌తో అందరు నోరెళ్లపెట్టేశారుగా..!
ప్రధానాంశాలు:
Dancer Janu : బంగారం లాంటి ఛాన్స్‌ను భలే వదిలేసుకుంది.. ఆమె స్టేట్‌మెంట్‌తో అందరు నోరెళ్లపెట్టేశారుగా..!
Dancer Janu : తెలుగు టెలివిజన్‌లో సెన్సేషన్ అయిన ‘బిగ్ బాస్’ షో Big Boss Show Telugu తొమ్మిదో సీజన్‌కు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లతో ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ గేమ్ షోలో పాల్గొనాలన్నది చాలామంది సెలబ్రిటీల కల. అయితే, ఈ ‘బిగ్ ఛాన్స్’ని జాను లిరి సున్నితంగా వదిలేసిందన్న వార్త ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Dancer Janu : బంగారం లాంటి ఛాన్స్‌ను భలే వదిలేసుకుంది.. ఆమె స్టేట్‌మెంట్‌తో అందరు నోరెళ్లపెట్టేశారుగా..!
Dancer Janu : ఇలా చేసిందేంటి..
సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 9లో జాను లిరి ఎంట్రీ ఇవ్వనుందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ వాటిపై తాజాగా జాను క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. “బిగ్‌బాస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు. గతంలో రెండు సీజన్లకు ఆఫర్ వచ్చిందా నిజమే.. కానీ నేను స్పష్టంగా తిరస్కరించాను,” అని తేల్చేసింది. ఇంటర్వ్యూలో .. “లక్షల్లో రెమ్యునరేషన్ వస్తే కూడా వెళ్ళవా?” అన్నదానికి జాను నవ్వుతూ, “జానును డబ్బుతో కొనలేరు!” అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆమె ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జాను నిర్ణయంపై ఫ్యాన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె వ్యక్తిత్వాన్ని, నిర్ణయాన్ని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం “ఇంత మంచి అవకాశం వదిలేసిందేంటి!”, “బంగారం లాంటి ఛాన్స్‌ని కాలితో తన్నేసినట్లే!” అంటూ కామెంట్లు పెడుతున్నారు. జాను లిరి టాలీవుడ్‌కు చెందిన మోడల్, యాక్ట్రెస్‌గా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తన స్పష్టమైన అభిప్రాయాలు, బోల్డ్ స్టేట్మెంట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తోంది.