Bigg Boss 9 | బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టే కామన్ మ్యాన్స్ ఎవరెవరంటే..!
Bigg Boss 9 | బిగ్ బాస్ కార్యక్రమం 9వ సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటుంది. ఏడోవ తేదీ నుంచి ఈ షో స్టార్ మా లో టెలికాస్ట్ అవ్వబోతోంది. సెలబ్రిటీ కంటెస్టెంట్లు పదిమందిని అనౌన్స్ చేసిన బిగ్ బాస్ యాజమాన్యం కామన్ మ్యాన్స్ ను సైతం ఈ సీజన్లో భాగం చేయాలనే ఉద్దేశ్యంతో అగ్నిపరీక్ష అంటూ ఒక గేమ్ షో ని కండక్ట్ చేశారు. అందులో పాల్గొన్న 45 మంది నుంచి మొదటగా 15 మందిని సెలెక్ట్ చేశారు.

#image_title
ఇక తాజా సమాచారం ప్రకారం ఐదుగురు కాకుండా ఆరుగురు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వాళ్ళను ఫైనల్ చేసిన బిగ్ బాస్ యాజమాన్యం రేపు సాయంత్రం ఆ లిస్టును కన్ఫామ్ చేస్తూ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది మొదట దమ్ము శ్రీజ ను సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది
రెండోవ ప్లేస్ లో మాస్క్ మ్యాన్ హరీష్ ను సెలెక్ట్ చేశారు..మూడో ప్లేస్ లో ఆర్మీ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేశారు .ఆ తర్వాత ప్రియ శెట్టి గారిని సెలెక్ట్ చేశారు…ఈమె చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది నెంబర్ ఫైవ్ లో మర్యాద మనీష్ ను సెలెక్ట్ చేశారు. నెంబర్ సిక్స్ లో హీ మ్యాన్ పవన్ ను సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది… మొత్తానికైతే వీళ్ళంతా బిగ్ బాస్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.