Prabhas : కృష్ణం రాజు మృతితో ప్రభాస్ అండ్ తన ఫ్యామిలీ మొత్తం తీవ్ర బాధలో ఉన్నారు. అయితే పెదనాన్న లేకపోయినా నీ వెంట మేమునాం అంటూ రీసెంట్ గా మొగళ్తూరులో కృష్ణం రాజు సంస్మరణ వేదికలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రభాస్ కి తమ అభిమానాన్ని చూపించారు. అందుకే ఆరోజు అక్కడకి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి భోజనం పెట్టించి పంపించాడు ప్రభాస్. ఇక ఇదిలాఉంటే పెదనాన్న లేరన్న బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ప్రభాస్ సినిమా షూటింగ్స్ కి పాల్గొంటున్నాడు.ఈమధ్యనే సలార్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అది ఈ నెల చివరి దాకా కొనసాగిస్తారని తెలుస్తుంది.
ఇక డిసెంబర్ లో ప్రభాస్ నెల మొత్తం ఆదిపురుష్ సినిమా కోసం కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణ ఇతివృత్తంతో వస్తున్న ఈ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా వైడ్ గా భారీగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కోసం ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట.అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం డిసెంబర్ 1 నుంచి నెల మొత్త ఇచ్చాడట. సో ప్రభాస్ ప్రమోషన్స్ లో ఉంటే ఫ్యాన్స్ కి పండుగే అన్నట్టే లెక్క. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ విషయం తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ప్రభాస్ ఎక్కడ ఈవెంట్ పెడితే అక్కడకి వేల సంఖ్యలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. ఆదిపురుష్ సినిమా 2023 జనవరి లో రిలీజ్ ప్లాన్ చేయగా సలార్ 2023 సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వీటితో పాటుగా మారుతి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఈ 3 సినిమాలు రిలీజ్ తర్వాత ప్రాజెక్ట్ K, స్పిరిట్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటాడట ప్రభాస్.సో ఈ లెక్కన చూస్తే ప్రభాస్ 2023 లో మూడు సినిమాలు రిలీజ్ చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. ప్రాజెక్ట్ కె మాత్రం 2024 సంక్రాంతికి గానీ సమ్మర్ గానీ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. దాని తర్వాతనే సందీప్ వంగ స్పిరిట్ రిలీజ్ అవుతుందని టాక్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.