
flipkart diwali back to back sale huge discount offers for you
Flipkart Diwali sale : దసరా పండుగ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్ దిగ్గజం ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించింది. ఇది ఇంకా దేశంలో కొనసాగుతోంది. అయితే,మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ దివాళీ సేల్ డేట్స్ ప్రకటించడంతో ఫ్లిప్‌కార్ట్ కూడా దీపావళి పండుగను దృష్టిలోపెట్టుకుని బ్యాక్ టు బ్యాక్ ఈ సేల్‌ను ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇందులో వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటాయని తెలిపింది.సెప్టెంబర్ 30తో బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగుస్తుండటంతో మరో సేల్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. అనంతరం దివాళీ సేల్ ప్రారంభం కానుంది.
దీపావళి సందర్భంగా ఈ బిగ్ దివాళీ సేల్‌ను వినియోగదారులకు అందించనున్నట్టు పేర్కొంది. దీనికి సంబంధించిన తేదీల వివరాలను ఫ్లిప్‌కార్ట్ ఒక్కసారిగా ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు ఈ దివాళీ సేల్ ఉంటుందని వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్‌కు సంబంధించిన తేదీలను బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రమోట్ చేస్తున్నపోస్టర్ ఒకటి విడుదలైంది. దీనిప్రకారం ఎప్పటిలాగానే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. నార్మల్ వినియోగదారులకు అక్టోబర్ 5న ఈ సేల్ ప్రారంభం కానుంది.
flipkart diwali back to back sale huge discount offers for you
అయితే, ఈ దివాళీ సేల్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10శాతం వరకు అదనపు డిస్కౌంట్ లభించనుందని తెలుస్తోంది.బిగ్ బిలియన్ డేస్‌లోనూ ఈ ఆఫర్స్ వర్తించాయి. ప్రముఖ అంతర్జాతీయ ఉత్పత్తులు అయిన యాపిల్, శాంసంగ్, రియల్‌మీ, పోకో, షావోమీ స్మార్ట్‌ఫోన్‌లపై దివాళీ సేల్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్లు లభించనున్నాయి.స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు,గృహోపకరణాలపై భారీ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ను సత్వరమే వినియోగించుకునేలా ఫ్లిప్ కార్ట్ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టింది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.