Liger Movie : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అభిమానులకు చిత్ర బృందం శుభవార్త అందించింది. ఈనెల 25న దేశవ్యాప్తంగా విడుదల కానున్న లైగర్ మూవీ టాక్ రెండ్రోజుల ముందు గానే విడుదలైంది. ఈ చిత్రాన్ని ముంబైలో ప్రీ రిలీజ్ షోస్ వేయడంతో అసలు సినిమా టాక్ ఎలా ఉందో అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు సినిమా టాక్ విడుదల కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
లైగర్ మూవీ కోసం కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు. పాన్ ఇండియా అంతటా ఆసక్తిగా చూస్తోంది. చిత్ర బృందం కూడా మొన్నటివరకు దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహించారు. ఇదిలాఉండగా ఆగస్టులో టాలీవుడ్‌కు మంచి హిట్లు పడ్డాయి.ఇప్పటికే మూడు సూపర్ హిట్ సినిమాలు రాగా అన్ని మంచి విజయాన్ని పొందాయి.లైగర్‌తో ఆ ఊపు కంటిన్యూ అవుతుందని అంతా భావిస్తున్నారు. దీనికి తోడు బాలీవుడ్‌లో వరుస ప్లాపులు పడుతున్నాయి. బాయ్ కాట్ బాలీవుడ్ మూవీస్ హాష్ ట్యాగ్ అక్కడ నేటికి వైరల్ అవుతోంది. దీంతో విడుదలైన సినిమాలు విడుదలైనట్టే ప్లావ్ అవుతున్నాయి. ప్రేక్షకులు రాకపోవడంతో కలెక్షన్లు కూడా పడిపోతున్నాయి. కానీ సౌత్ సినిమాలను బాలీవుడ్ ప్రజలు బాగా ఆదరిస్తున్నారు.
కార్తీకేయ సినిమా ఏకంగా లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ మూవీలను కూడా భారీ దెబ్బకొట్టింది. ఇప్పుడు లైగర్ విడుదల కానుంది. దీనికి బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ బ్యాన్ బోన్‌గా ఉన్నాడు. లైగర్ రన్ టైం 2 గంటల 20 నిమిషాలు. సెన్సార్ కట్టింగులో 7 కీలక సీన్లు వెళ్లిపోయాయి. తొలి భాగం 75 నిమిషాలు, రెండో భాగం 65 నిమిషాలుగా డిసైడ్ చేశారు. లైగర్ మూవీలో 7 ఫైట్లు, 6 పాటలు ఉన్నాయి.ఇక సినిమా అంతా హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూనే తిరుగుతుందట.బాక్సింగ్, హీరోయిన్‌తో లవ్, రెండు సాంగ్స్ ఫస్టాఫ్‌లో హైలెట్స్‌గా నిలుస్తాయని టాక్. ఇక సెకండాఫ్‌లో అమ్మ, ఫ్యామిలీ సెంటిమెంట్, క్లైమాక్స్ సీన్స్ హైలెట్స్‌గా ఉంటాయని అంటున్నారు. పోకిరీ మూవీలాగా సినిమా మెల్లిగా ప్రేక్షకులను మెప్పించగలిగితే కలెక్షన్ల వర్షం కురుస్తుందని టాక్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.