Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమా ల్లో నటిస్తున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా తో దసరా కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అది మాత్రమే కాకుండా భోళా శంకర్ మరియు వాల్తేరు వీరన్న సినిమాలతో కూడా చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలు మాత్రమే కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా పట్టాలు ఎక్కబోతుంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.
మరో వైపు మారుతి దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమా ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ లేదు. ఇన్ని సినిమా లు లైన్ లో ఉండగా నేడు చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఏమైనా హడావుడి లేక పోవడం తో అభిమానులకు నిరాశ కలుగుతోంది. గాడ్ ఫాదర్ నుండి టీజర్ విడుదల అయ్యి కాస్త పర్వాలేదు అనిపించారు. గాడ్ ఫాదర్ టీజర్ ను నిన్న విడుదల చేయడం తో నేడు ఇతర సినిమా ల నుండి అప్‌డేట్స్ వస్తాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఇప్పటి వరకు ఏ సినిమా నుండి కూడా అదిరి పోయే అప్‌డేట్ అయితే లేదు. భోళా శంకర్ సినిమా ను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్లుగా ఒక పోస్టర్ ను విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు.
అంతకు మించి భోళా శంకర్ గురించి ఎలాంటి హంగామా లేదు. మరో వైపు వాల్తేరు వీరన్న సినిమా నుండి తప్పుండా హంగామా ఉంటుందని.. ఫస్ట్ లుక్ లేదా టీజర్ ను విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కాని ఇప్పటి వరకు కనీసం టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించలేదు. మరో వైపు వెంకీ కుడుముల సినిమా కు సంబంధించిన అప్డేట్ కూడా లేకుండా పోయింది అంటూ విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి చిరంజీవి బర్త్ డే సందర్బంగా కేవలం గాడ్ ఫాదర్ సినిమా యొక్క టీజర్ తో సరి పెట్టుకోవాల్సి వచ్చిందని అభిమానులు ఉసూరుమంటున్నారు.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.