
gopichand comments on his brother
Gopichand : మాచో హీరో గోపిచంద్ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. తొలుత హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత విలన్గా మారి మళ్ళీ హీరోగా మారి వరుస విజయాలు అందుకున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం పరితపిస్తున్న ఆయన ప్రస్తుతం తనకు వరుస విజయాలు అందించిన శ్రీ వాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు లక్ష్యం 2 అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మైసూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడ ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సందర్భంగా గోపీచంద్ కాలుకు స్వల్ప గాయాలైనట్టు ఈ సినిమా దర్శకుడు శ్రీవాస్ మీడియాకు తెలిపారు.
షూటింగ్ లొకేషన్‌లో కాలు జారడంతో ఎత్తైన ప్రదేశం నుంచి కిందపడ్డారు. ఓ ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, గోపీచంద్ క్షేమంగా ఉన్నారని సమచారం. అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. గోపీచంద్ సినిమాల విషయానికొస్తే.. మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీటై విడుదలకు రెడీగా ఉంది. దీంతో పాటు గోపీచంద్ ప్రముఖ తమిళ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే అన్నట్లు టాక్ నడుస్తోంది. డైరెక్టర్ హరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన ‘సింగం’ సిరీస్ సినిమాలతో సూపర్ ఫాలోయింగ్‌ను, పాపులారిటీని తెచ్చుకున్నారు.
gopichand escapes from major accident
దర్శకుడు టి కృష్ణ సినీ వారసుడిగా రంగ ప్రవేశం చేసిన గోవింద్ ముందుగా తొలి వలపు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమా ఆయనకు పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత ఆయన విలన్ గా మారి జయం సినిమాలో అందరినీ మెప్పించాడు. ఇక ఆ తర్వాత నిజం అనేది సినిమాలో మహేష్ బాబుకు విలన్గా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇక వర్షం సినిమాతో కూడా ప్రభాస్ కు విలన్ గా నటించి తెలుగులో ది బెస్ట్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు . ఇక ఆ తర్వాత యజ్ఞం సినిమాలో హీరోగా మారిన ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే పని పడలేదు. ఆంధ్రుడు, రణం, రారాజు, ఒక్కడున్నాడు, లక్ష్యం, శౌర్యం వంటి అనేక సినిమాల్లో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.