Home » Entertainment » Gopichand Sileed Release Date Fixed For Gopichand Seetimaar Movie
Entertainment

Gopichand : గోపీచంద్ సీటిమార్ కి సాలీడ్ రిలీజ్ డేట్ ఫిక్స్ ..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: January 28, 2021, 7:09 pm
Advertisement

Gopichand : గోపిచంద్ కబడ్డి క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న సీటిమార్ సినిమా రూపొందుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. లాక్ డౌన్ కి ముందు 3 షెడ్యూల్స్ జరిగిన ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తైంది. కాగా లాక్ డౌన్ తర్వాత సీటిమార్ షూట్ ను తిరిగి ప్రారంభించారు. గోపీచంద్, తమన్నా హైదరాబాద్‌లో ఒకే షెడ్యూల్‌లో బ్యాలెన్స్ భాగాలను షూట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ – తమన్నా ఆంధ్ర – తెలంగాణ మహిళల కబడ్డీ జట్ల కోచ్లుగా కనిపించనున్నారు.

Advertisement

gopichand-sileed release date fixed for gopichand seetimaar movie

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ దిగంగన సూర్యవంశీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఒక వైపు షూటింగ్ జరుగుతూనే మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో గోపీచంద్ సీటీమార్ సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర బృందం తాజాగా ప్రకటించారు. ఇప్పటికే వరసగా వరుణ్ తేజ్ గని, అల్లు అర్జున్ పుష్ప సినిమాలతో పాటు రీసెంట్ గా ఎన్.టి.ఆర్ – రాం చరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఇదే వరసలో ఇప్పుడు గోపీచంద్ సీటీమార్ ఏప్రిల్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు.

Advertisement

Gopichand : ఫ్లాపుల నుంచి బయటపటడానికి ప్రయత్నిస్తున్న గోపీచంద్ ..?

కాగా త్వరలో మారుతీ – గోపీచంద్ కాంబినేషన్ లో ఒక సినిమా మొదలబోతోంది. జిఏ2 పిక్చర్స్ యూవి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు అలిమేలు మంగ వెంకటరమణ అన్న సినిమాలో కూడా నటించబోతున్నాడు గోపీచంద్. ఈ సినిమా ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించబోతున్నాడు. ఈ మధ్య వరసగా ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న గోపీచంద్ మళ్ళీ సీటీమార్ సినిమాతో హిట్ కొట్టి ఫాంలోకి రావాలనుకుంటున్నాడు. అంతేకాదు వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నాడు.

 

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి